అగ్రికల్చర్‌‌, ఫార్మా, ఐటీ..బిజినెస్​ విస్తరిస్తాం

అగ్రికల్చర్‌‌, ఫార్మా, ఐటీ..బిజినెస్​ విస్తరిస్తాం

హైదరాబాద్‌‌, వెలుగు: ఇండియా, ఘనా దేశాల మధ్య అగ్రికల్చర్‌‌, ఫార్మా, ఐటీ బిజినెస్‌‌ సంబంధాలను  మరింత  విస్తరిస్తామని ఘనా హైకమిషనర్‌‌  అసోమా చేరిమే క్వాకూ అన్నారు.  హైదరాబాద్‌‌లోని హెచ్​ఐసీసీలో ఇండియా–ఆఫ్రికా ట్రేడ్​ కౌన్సిల్​ (ఐఏటీసీ) ఆధ్వర్యంలో  నిర్వహించిన ఇండియా–ఘనా సమ్మిట్ కు ఆయన చీఫ్​ గెస్ట్​గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండియన్​ గవర్నమెంట్‌‌ అడ్వైజర్‌‌ అజయ్‌‌మిశ్రా, రీజనల్‌‌ పాస్‌‌పోర్ట్‌‌ ఆఫీసర్‌‌ బాలయ్యతో కలిసి  గవర్నమెంట్‌‌ ఆఫ్‌‌ ఇండియా రూపొందించిన ఎంఎస్‌‌ఎంఈ ఉద్యమ్‌‌ రిజిస్ట్రేషన్‌‌ సెంటర్‌‌ను ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఘనాలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఘనా మినిస్టర్‌‌ కౌన్సిలర్‌‌ ఎర్నెస్ట్‌‌ నానా అడ్జే మాట్లాడుతూ..  గత 2021-–22లో ఇండియా 736.56 మిలియన్‌‌ డాలర్ల విలువైన ప్రోడక్ట్స్​ను ఎక్స్‌‌పోర్ట్స్‌‌ చేసిందని తెలిపారు. ఇండియా- ఆఫ్రికా ఇన్​స్టిట్యూట్​ ఆన్​ ఇన్​ఫర్మేషన్​ టెక్నాలజీ (ఐఏఐఐటీ), ఫుడ్‌‌ ప్రాసెసింగ్‌‌ ఇంక్యూబేషన్‌‌ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా ఘనా.. ఆంధ్రప్రదేశ్‌‌, తెలంగాణ రాష్ట్రాల  క్యూబా ట్రేడ్‌‌ కమిషనర్‌‌లుగా డాక్టర్.కేవీ రెడ్డి,  జీవీ కృష్ణలకు నియామక పత్రాలను అందజేశారు.