సీఐ నుంచి ప్రాణహాని.. HRC కి హైకోర్టు లాయర్ ఫిర్యాదు

సీఐ నుంచి ప్రాణహాని.. HRC కి హైకోర్టు లాయర్ ఫిర్యాదు

మంచిర్యాల జిల్లా మందమర్రి సీఐపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు హైకోర్టు న్యాయవాది వెంకటేశ్. మందమర్రికి చెందిన టిఆర్ఎస్ నాయకులు , మందమర్రి సీఐ నుండి తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులో తెలిపారు. మందమర్రిలో టీఆర్ఎస్ నాయకుల అన్యాయాలపై  ప్రశ్నించినందుకు  సిఐ తనను చంపుతానని బెదిరించాడన్నారు. స్థానిక టిఆర్ఎస్ నాయకుల ఫిర్యాదుతో పోలీసులు తనపై ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారన్నారు. దీంతో ప్రాణరక్షణ కల్పించాలని హెచ్ ఆర్ సీలో ఫిర్యాదు చేశాడు వెంకటేశ్. దీంతో  స్పందించిన హెచ్ ఆర్సీ జూన్ 9 లోగా నివేదిక ఇవ్వాలంటూ రామగుండం కమిషనర్ కు ఆదేశాలు జారీ చేసింది.