స్టూడెంట్లకు సర్టిఫికెట్లు ఇవ్వండి : హైకోర్టు

స్టూడెంట్లకు  సర్టిఫికెట్లు ఇవ్వండి : హైకోర్టు
  • మల్లారెడ్డి ఇంజనీరింగ్‌‌‌‌‌‌‌‌ కాలేజీకి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: నాలుగేండ్ల ట్యూషన్‌‌‌‌‌‌‌‌ ఫీజు చెల్లించాలని పట్టుబట్టకుండా విదార్థి సర్టిఫికెట్లు ఇవ్వాలని మల్లారెడ్డి ఇంజనీరింగ్‌‌‌‌‌‌‌‌ కాలేజీకి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజు బకాయి ఉందని చెప్పి సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంపై నల్లగొండ జిల్లాకు చెందిన నమిలే సంజయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ వేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌ను జస్టిస్‌‌‌‌‌‌‌‌ కె. లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ గురువారం విచారించారు. 

కాలేజీ నిర్ణయం చట్టవిరుద్ధమని, సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరించడం యూజీసీ, ఏఐసీటీఈ, తెలంగాణ స్టేట్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ హయ్యర్‌‌‌‌‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌(టీఎస్‌‌‌‌‌‌‌‌సీహెచ్‌‌‌‌‌‌‌‌ఈ) రూల్స్‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకమని పిటిషనర్‌‌‌‌‌‌‌‌ లాయర్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. వాదనల తర్వాత హైకోర్టు, పిటిషనర్‌‌‌‌‌‌‌‌10వ తరగతి, ఇంటర్మీడియట్‌‌‌‌‌‌‌‌ మెమోలు, టీసీ, బోనాఫైడ్‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్లను ఇవ్వాలని మల్లారెడ్డి ఇంజనీరింగ్‌‌‌‌‌‌‌‌ కాలేజీకి ఆదేశాలు జారీ చేసింది.