మీటింగ్ నిర్వహించకపోతే కౌన్సిల్​ను రద్దు చేయండి : హైకోర్టు

మీటింగ్ నిర్వహించకపోతే కౌన్సిల్​ను రద్దు చేయండి : హైకోర్టు
  • జీహెచ్ఎంసీపై హైకోర్టు ఆగ్రహం
  • మల్కాజిగిరి కార్పొరేటర్ వేసిన పిటిషన్​పై వాదనలు
  • సమావేశాల నిర్వహణపై వివరణ ఇవ్వాలంటూ  అధికారులకు ఆదేశాలు
  • విచారణ ఈ నెల 12కి వాయిదా

హైదరాబాద్, వెలుగు: కౌన్సిల్ మీటింగ్ నిర్వహించకపోతే కౌన్సిల్​ను రద్దు చేయాలంటూ జీహెచ్ఎంసీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌన్సిల్ మీటింగ్​ను నిర్వహించాలని మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ ఈ నెల 1న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఆ పిటిషన్​పై విచారణ చేపట్టిన హైకోర్టు.. జీహెచ్ఎంసీ తీరుపై మండిపడింది. కౌన్సిల్ మీటింగ్ నిర్వహించకపోతే రద్దు చేయొచ్చు కదా అని  ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంఏయూడీ స్టాండింగ్ కౌన్సిల్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ ఏర్పాటుపై వివరణ ఇవ్వాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.  విచారణను ఈ నెల12కి వాయిదా వేసింది.

ఇయ్యాల బల్దియా అఖిలపక్ష సమావేశం

జీహెచ్ఎంసీ అఖిలపక్ష సమావేశం మంగళవారం బల్దియా హెడ్డాఫీసులో జరగనుంది. ఉదయం11.30 గంటలకు సమావేశానికి రావాలంటూ బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలను మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆహ్వానించారు.  ఈ సమావేశంలో కౌన్సిల్ మీటింగ్ నిర్వహణ తేదీతో పాటు ఏయే సమస్యలపై చర్చ జరగాలో నిర్ణయించనున్నారు. కార్పొరేటర్ శ్రవణ్​ వేసిన పిటిషన్​పై హైకోర్టులో సోమవారం వాదనలు జరిగిన కొద్ది గంటల్లోనే మేయర్ అఖిలపక్ష సమావేశానికి సభ్యులను ఆహ్వానించారు. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు సభ్యులు సమావేశంలో పాల్గొననున్నారు.