‘దిశ’ను రెండు వారాలు ఆపండి

‘దిశ’ను  రెండు వారాలు ఆపండి

హైదరాబాద్: సంచలన ఘటన ఆధారంగా తెరకెక్కిన ‘దిశ’  సినిమా విడుదలకు రెండు వారాల బ్రేక్ పడింది. హైదరాబాద్ శివార్లలో జరిగిన దిశ అత్యాచారం ఘటన దేశ వ్యప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సంచలన ఘటన ఆధారంగా మరికొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘దిశ’ సినిమా నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. దిశ తల్లిదండ్రులతోపాటు మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రాంగోపాల్ వర్మ సైలెంట్ అయినట్లు తెలుస్తోంది. 
వర్మ సైలెంట్ కావడంతో దర్శక నిర్మాతలు ఆనంద్ చంద్ర, అనురాగ్ లో దిశ లాంటి వాస్తవ ఘటనల ఆధారంగా సినిమాను పూర్తి చేశారు. సినిమా పేరు కూడా ‘ఆశ ఎన్ కౌంటర్’గా మార్చి విడుదలకు సిద్ధమయ్యారు. ఈ నేపధ్యంలో సినిమా విడుదలకు సెన్సార్ సర్టిఫికెట్ పరిశీలనకు పంపగా ఏ సర్టిఫికెట్ కూడా వచ్చింది. కరోనా లాక్ డౌన్ కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే తాజాగా లాక్ డౌన్ ఎత్తేశాక సినిమా విడుదల చేయనున్నట్లు ప్రచారం జరగడంతో దిశ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు సినిమా విడుదలను రెండు వారాలు ఆపాలని ఆదేశించింది.