ఆనందయ్య మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

V6 Velugu Posted on Jun 07, 2021

కృష్ణపట్నం కు చెందిన ప్రముఖ ఆయుర్వేద నిపుణుడు ఆనందయ్య మందుకు..హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఆనందయ్య మందును ప్రభుత్వం నిలుపుదల చేసింది. కరోనా బాధితులకు తక్షణమే మందును పంపిణీ చేయాలంటూ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కంటి చుక్కల మందుకు సంబంధించి రెండు వారాల్లో నివేదిక అందించాలని ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 21కి వాయిదా వేసింది. ఈ రోజు(సోమవారం)నుంచి ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభమైంది.

కంట్లో వేసే మందుకు సంబంధించిన నివేదికలు రావాల్సి ఉన్నాయంటూ గతంలో ఆంధ్రప్రదేశ్  ఆనందయ్య మందుకు అనుమతినివ్వలేదు. ఈ మందును కమిటీ ముందు చూపించలేక పోవడంతో దీనికి ఏపీ సర్కారు అనుమతి నిరాకరించింది. ఆనందయ్య ఇచ్చే పి, ఎల్, ఎఫ్‌... మందులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. CCRAS నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల హాని లేదని నివేదికలు తేల్చాయి. CCRAS నివేదిక ప్రకారం ఆనందయ్య మందు వాడితే హాని లేదని నివేదికలు తేల్చాయి.

Tagged AP, High Court green signal, Anandayya drug

Latest Videos

Subscribe Now

More News