ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఈడీకి ఫిర్యాదు చేసిన హైకోర్టు న్యాయవాది

ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఈడీకి ఫిర్యాదు చేసిన హైకోర్టు న్యాయవాది

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఈడీకి ఫిర్యాదు చేశారు హైకోర్టు న్యాయవాది సురేష్.    ఫోన్ టాపింగ్ కేసులోని నిందితులు వ్యాపారులను బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేశారని ఫిర్యాదులో తెలిపారు.  ఓ పొలిటికల్ పార్టీకి  పోలీసు వాహనాలు డబ్బులు తరలించారని నిందితులే ఒప్పుకున్నారని చెప్పారు. 

ఫోన్ ట్యాపింగ్ పై ఈడీ PMLA యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పిర్యాదు లోకోరారు అడ్వకేట్ సురేష్.  ఋ  కేసులో  ఇప్పటివరకు  అసలు నిందితులను  విచారించలేదన్నారు. ఈడీ  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే ఫోన్ ట్యాపింగ్ వెనకాల ఉన్న రాజకీయ నాయకులు బయటికి వస్తారని తెలిపారు. 

మరో వైపు  ఈ కేసులో కీలక నిందితుడైన  టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు రిమాండ్ ను ఏప్రిల్ 12  వరకు  పొడిగించింది కోర్టు . కిషన్ రావును  చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు.  రాధాకిషన్ రావు వాంగ్మూలం ఆధారంగా మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.