పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డుకు హైకోర్టు నోటీసులు.. విచారణ వాయిదా

పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డుకు హైకోర్టు నోటీసులు.. విచారణ వాయిదా

పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు జీవో నంబర్ 57,58ని ప్రిలిమ్స్ పరీక్షలు అయిన తరువాత తెరమీదికి తీసుకువచ్చిందని పోలీస్ జాబ్ అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు ఆగస్టు 17వరకు రిక్రూట్మెంట్ సంబంధించి ఎలాంటి ఫలితాలు విడుదల చేయొద్దని బోర్డును ఆదేశించింది.  పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 

ALSO READ:పోస్టల్ శాఖలో 30 వేలకు పైగా ఉద్యోగాలు..టెన్త్ పాసైతే చాలు..

అభ్యర్థుల తరఫు లాయర్లు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీస్ జాబ్ ల నియామకం సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు బోర్డు ఎక్కడా జీవో నంబర్ 57, 58 గురించి ప్రస్తావించలేదని అన్నారు. 

ప్రిలిమ్స్ పరీక్షలు పూర్తయ్యాక ఈ జీవోల ప్రకారం.. రిజర్వేషన్ల ప్రకారం మార్కులు తగ్గిస్తున్నట్లు ప్రకటించినట్లు చెప్పారు.  దీని ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ ప్రకారం కటాఫ్ మార్కులు బోర్డు నిర్ణయించింది. 

రిజర్వేషన్లపై కటాఫ్ మార్కులు ఉన్నాయని బోర్డు నోటిఫికేషన్ లో వెల్లడించలేదని కోర్డుకి పిటిషనర్లు తెలిపారు. దీనికి తోడు ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్లను బోర్డు పూర్తిగా పట్టించుకోలేదు. 

దీంతో ప్రిలిమ్స్ రాసిన అభ్యర్థులు అందరూ తీవ్రంగా నష్ట పోయే అవకాశం ఉందని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఇప్పటి వరకు 52 పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణను కోర్టు ఈ నెల 17కు వాయిదా వేసింది.