దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం.. 23న కుటుంబసభ్యులకు అప్పగింత

దిశ నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం.. 23న కుటుంబసభ్యులకు అప్పగింత

దిశ నిందితుల ఎన్ కౌంటర్‌పై హైకోర్టులో విచారణ పూర్తయింది. నలుగురు నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం చేయాలని హైకోర్టు ఆదేశించింది. సోమవారం సాయంత్రం 5 గంటలలోపు రీ పోస్టు మార్టం పూర్తి చేయాలని, ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీయాలని చెప్పింది.

ఈ నెల 6న దిశ రేప్, మర్డర్ కేసు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశాక పలువురు మహిళా సంఘాల నేతలు హైకోర్టును ఆశ్రయించారు.  అది బూటకపు ఎన్‌కౌంటర్ అని, పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టుకు లేఖలు రాశారు. వాటిపై హైకోర్టు 9వ తేదీన విచారణ చేపట్టి.. మృతదేహాలను గాంధీ ఆస్పత్రిలో భద్రపరచాల్సిందిగా ఆదేశించింది. అయితే ఆ తర్వాత ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు కావడం, జుడిషియల్ విచారణకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశించడంతో హైకోర్టు విచారణకు బ్రేక్ పడింది. అయితే హైకోర్టు, ఇతర సంస్థ విచారణ ఆపేయాలని ఆదేశించిన సుప్రీం మృతదేహాలపై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ విషయంపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు.. నిందితుల మృతదేహాలకు మరోసారి పోస్టుమార్టం చేసి వారి కుటుంబాలకు అప్పగించాలని ఆదేశించింది.

ఇప్పటికే 50 శాతం డీ కంపోజ్

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఇవాళ ఉదయం విచారణ చేపట్టింది హైకోర్టు. ఈ సందర్భంగా గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రావణ్ కోర్టుకు హాజరై… మృతదేహాలు ఇప్పటికే 50శాతం డీ కంపోజ్ అయ్యాయని తెలిపారు. మైనస్ 2 నుంచి మైనస్ 4 డిగ్రీల సెల్సీయస్ ఫ్రీజర్ లో నాలుగు మృతదేహాలను ప్రీజర్‌లో ఉంచామని తెలిపారు. ఇంకా డెడ్ బాడీస్ ప్రీజర్‌లలో ఉంటే వారం రోజుల్లో పూర్తిగా 100%  డీ కంపోజ్ అయ్యే అవకాశముందన్నారు.

గాంధీ డాక్టర్లపై నమ్మకం లేదు

దీంతో పిటిషనర్లు రీ పోస్టుమార్టం జరపాలని కోరడంతో హైకోర్టు అంగీకరించింది. అయితే వారు తమకు ఇక్కడి డాక్టర్లు పారదర్శకంగా వ్యవహరిస్తారన్న నమ్మకం లేదని, వేరే ఇతర సంస్థల డాక్టర చేత పోస్టుమార్టం చేయించాలన్నారు. దీంతో హైకోర్టు 23వ తేదీన మెడికల్ బోర్డ్ ఆఫ్ ఇండియా డాక్టర్లతో నిందితుల డెడ్ బాడీలకు రీ పోస్టుమార్టం చేయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీన్ని మొత్తం వీడియో తీయాలని, అన్ని ఎవిడెన్స్‌లను సీల్డ్ కవర్‌లో హైకోర్టు సూచించింది. ఎన్ కౌంటర్‌కు సంబంధించిన అన్ని ఎవిడెన్స్‌లను బుల్లెట్స్, గన్స్, ఫోరెన్సిక్ రిపోర్ట్, పోస్టుమార్టం నివేదిక అన్ని భద్రపరచాలని చెప్పింది. రీ పోస్టుమార్టం పూర్తి అయిన తర్వాత పోలీసుల సమక్షంలోనే ఆ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని కోర్టు ఆదేశించింది.

MORE NEWS:

దిశ శరీరంలో ఆల్కహాల్ ఉన్నట్లు గుర్తించిన ఫోరెన్సిక్ నిపుణులు

స్కూల్ వాట్సాప్ గ్రూప్‌: క్లాస్‌ అమ్మాయిల్ని రేప్ చేద్దామంటూ సెలబ్రెటీల పిల్లలు చాట్

గన్స్ లాక్కొని కాల్పులు జరిపారు. అందుకే ఎన్ కౌంటర్ చేశాం: సీపీ సజ్జనార్

అదే తీరుగా 9 హత్యలు చేసిన దిశ నిందితులు?