గొర్రెల పంపిణీ స్కామ్ నిందితుడికి చుక్కెదురు

గొర్రెల పంపిణీ స్కామ్ నిందితుడికి చుక్కెదురు
  • కేసు కొట్టివేతకు హైకోర్టు నిరాకరణ

హైదరాబాద్, వెలుగు: గొర్రెల పం పిణీలో అవినీతి జరిగిందనే కేసులో నిందితుడు సయ్యద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  మొహి దుద్దీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు హైకోర్టులో చుక్కె దురైంది. ఈ కేసు కొట్టివేయాలం టూ అతను వేసిన  పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను హైకోర్టు కొట్టి వేసింది. ఈ మేరకు జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కె.సుజన గురువారం తీర్పు చెప్పారు. తమ వద్ద గొర్రెలు తీసు కెళ్లి సొమ్ము చెల్లించకపోవడంతో ఏపీలోని పల్నాడు జిల్లా విర్పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  మండలానికి చెందిన సన్నెబోయిన ఏడుకొండలు చేసిన ఫిర్యాదు మేరకు సయ్యద్  మొహిదుద్దీన్ పై గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేసు నమోదైంది. ఆ కేసును కొట్టేయాలని సయ్యద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. హైకోర్టులో పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వేశారు. పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  అడ్వొకేట్  వాదిస్తూ.. పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  రవాణా వ్యాపారం చేస్తుంటారని, పశుసంవర్ధక శాఖ నుంచి టెండర్లు పొంది  గొర్రెలు, మేకలు వంటి వాటిని లబ్ధిదారులకు రవాణా చేస్తుంటారని వివరించారు. ఇదే వ్యవహారంపై 2021–23 మధ్య ఎలాంటి టెండరు దక్కకపోవడంతో కోర్టును  ఆశ్రయించారని తెలిపారు. దీంతో అధికారులు కక్షతో ఆయనను కేసులో ఇరికించారని చెప్పారు. ఏసీబీ తరఫు సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  న్యాయవాది రవికిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు, పోలీసుల తరఫున ఏపీపీ  ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.గణేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వాదనలు వినిపిస్తూ గొర్రెల పంపిణీ స్కామ్  జరిగిందని, దీనిపై దర్యాప్తు  జరగుతోందని తెలిపారు. కేసు దర్యాప్తులో పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  తన నిర్దోషిత్వాన్ని కింది కోర్టులో తేల్చుకోవాలని చెప్పారు. వాదనలు విన్న జడ్జి.. ఫిర్యాదులో  ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పి పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొట్టివేశారు.