Farm house case : తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

Farm house case : తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

ఫాం హౌస్ కేసులో సింగిల్ జడ్జి తీర్పుపై ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ పై వాదనలు ముగిశాయి. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. అయితే లిఖితపూర్వక వాదనల సమర్పణకు కొంత సమయంకావాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది దవే కోర్టును అభ్యర్థించారు. దీంతో న్యాయస్థానం ఈ నెల 30 వరకు గడువు ఇచ్చింది.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తును రద్దుచేస్తూ హైకోర్టు సింగిల్ బెంచి తీర్పు చెప్పింది. అయితే దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రభుత్వం రిట్ అప్పీల్ దాఖలు చేసింది. పిటిషన్ కు సంబంధించి ఇరుపక్షాల వాదనలు విన్న సీజే నేతృత్వంలోని డివిజన్ బెంచ్ తీర్పు రిజర్వు చేసింది.