కేంద్రం ఆదేశాలను తూచా తప్పక పాటించాలి

కేంద్రం ఆదేశాలను తూచా తప్పక పాటించాలి

ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రంలో కరోనా పరీక్షలు పెంచాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. కొవిడ్ అంశంపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. చిన్నారుల్లో ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని కోర్టు వ్యాఖ్యానించింది. దాంతో నీలోఫర్ ఆస్పత్రి మాత్రమే కాకుండా... అదనంగా కొన్ని ఆస్పత్రుల్లో కూడా పిల్లల చికిత్సకు ఏర్పాటు చేయాలని చెప్పింది. ఈ నెల 21, 28 తేదీల్లో కేంద్రం జారీ చేసిన ఆదేశాలను తప్పక పాటించాలని ఆదేశాలిచ్చింది. కుల మతాలకు అతీతంగా.. పబ్లిక్ గ్యాదరింగ్స్ పై నిషేధం విధించాలని ఆదేశించింది. మాల్స్, థియేటర్లలో రూల్స్ పాటించేలా చూడాలని పేర్కొంది. వారాంతపు సంతల్లోనూ.. కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

For More News..

ఫిర్యాదు చేసిన వ్యక్తినే అరెస్ట్ చేసిన పోలీసులు

సోషల్ మీడియా టీఆర్ఎస్ సొంతమా?

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు బీజేపీ ప్రభుత్వం అరుదైన గౌరవం