ఫీజుల పెంపు ఉత్తర్వులు కొట్టేసిన హైకోర్టు 

ఫీజుల పెంపు ఉత్తర్వులు కొట్టేసిన హైకోర్టు 

హైదరాబాద్: రాష్ట్రంలో పీజీ వైద్య కళాశాలల్లో 2017-2020 సంవత్సరానికి సంబంధించిన ఫీజుల పెంపు ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2017-2020కి ఫీజులు పెంచుతూ 2017 మే 9న ప్రభుత్వం జీవోలు జారీ చేయడాన్ని తప్పుబట్టింది. టీఏఎఫ్ఆర్‌సీ సిఫార్సు లేకుండా ప్రభుత్వం ఫీజులను పెంచడంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారించిన సీజే ధర్మాసనం పీజీ మెడికల్ ఫీజుల పెంపుపై తీర్పు వెలువరించింది. 2016-19కి సంబంధించి టీఏఎఫ్ఆర్సీ ఖరారు చేసిన ఫీజులే తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసి ఉంటే 30 రోజుల్లోగా తిరిగి ఇచ్చేయాలని కాలేజీలకు స్పష్టంచేసింది. కోర్సు పూరైన విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇచ్చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

For more news

కేసీఆర్ను టచ్ చేసేవాడు ప్రపంచంలోనే లేడు

20వేలు ఇస్తేనే భూమి నీ పేరిట రాసిస్తా..