75 ఏళ్ల పోరాటం.. ఆదివాసీలకు అనుకూలంగా తీర్పు

75 ఏళ్ల పోరాటం.. ఆదివాసీలకు అనుకూలంగా తీర్పు

ములుగు జిల్లాలోని ఆదివాసీల సుదీర్ఘ పోరాటం ఫలించింది. రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.  ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలు రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ పరిధిలోకి వస్తాయని  హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తీర్పు చెప్పారు.  ఆదివాసుల తరపున వాదనలు వినిపించారు న్యాయవాది. రాజ్యాంగ పరిధిలోని ఐదో షెడ్యూల్ పరిధిలోకి రాదని వాదించారు ఆదివాసీయేతర రాజకీయ నేతలు. ఇన్నాళ్ల తర్వాత ఆదివాసీలకు అనుకూలంగా హైకోర్టు తీర్పు చెప్పింది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 23 గ్రామాలు రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 పరిధిలోకి రావని కొంత మంది ఆదివాసియేతర నేతలు హైకోర్టును ఆశ్రయించారు. అవి మైదాన ప్రాంతపు గ్రామాలని వాదించారు. అయితే ఆ గ్రామాలన్ని తమవేనని..ఎన్నో ఏళ్లుగా అక్కడ నివాసం ఉంటున్నామని ఆదివాసీలు పేర్కొన్నారు. బయటి నుంచి వచ్చిన కొంత మంది వ్యక్తులు ఆధిపత్యం చెలాయిస్తున్నారంటూ ఆదివాసీలు తెలిపారు.  ఆ 23 గ్రామాలను రాజ్యాంగంలోని షెడ్యూల్ 5 కిందనే ఉంచాలంటూ ఆదివాసీలు హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటీషన్ పై చీఫ్ జస్టీస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఆదివాసీల తరపున అడ్వొకేట్ చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. వాదోపవాదనలు విన్న తర్వాత సదరు 23 గ్రామాలు రాజ్యాంగంలోని షెడ్యూల్ 23 కిందకు వస్తాయని హైకోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు ధర్మసనం స్పష్టం చేసింది. తమకు అనుకూలంగా తీర్పు వచ్చినందుకు ఆదివాసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  ఇన్నాళ్ల తమ పోరాటానికి ఫలితం దక్కిందని వారు సంబర పడుతున్నారు.