భద్రాద్రి జిల్లా జూలూరుపాడులో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రత

భద్రాద్రి జిల్లా జూలూరుపాడులో  రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రత
  • ఇంకో 4 రోజులు మంటలే!
  • భద్రాద్రి జిల్లా జూలూరుపాడులో 46.4 డిగ్రీలు నమోదు


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండలు మరింత ముదురుతున్నాయి. బుధవారం కూడా రికార్డ్​ స్థాయిలో టెంపరేచర్లు నమోదయ్యాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో 46.4 డిగ్రీలు రికార్డయింది. ఇదే జిల్లా గరిమెళ్లపాడులో 45.4, మహబూబాబాద్​జిల్లా బయ్యారం, ఖమ్మం జిల్లా ఖానాపూర్​లో 45.4, సూర్యాపేట జిల్లా మామిళ్లగూడెం, నల్గొండ జిల్లా నిడమనూరులో 45.2, నల్గొండ జిల్లా దామరచర్ల, జయశంకర్​భూపాలపల్లి జిల్లా మహదేవ్​పూర్, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో 44.9, లింగాలలో 44.7 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్​లో అత్యధికంగా ఖైరతాబాద్​లోని గణాంక భవన్​ వద్ద 41.6 డిగ్రీల టెంపరేచర్ రికార్డయింది. కాగా, మరో నాలుగు రోజుల పాటు ఎండలు ఇలాగే ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు కొత్తగూడెం, నల్గొండ, మహబూబ్​నగర్​ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలు మినహా  రాష్ట్రమంతటా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.