వికారాబాద్ జిల్లా దోమ ఎమ్మార్వో ఆఫీసులో భూ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దరి తీసింది. మోత్కూరు గ్రామానికి చెందిన చందు అనే రైతు ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఫ్యామిలీలో భూ పంపకాలు ఇంకా తేలకముందే తమ వాటా భూమిని దాయాదులు రియల్టర్లకు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు బాధితుడు.
ఈ క్రమంలో డీజిల్ పోసుకున్న చందును అడ్డుకునే క్రమంలో పోలీసులకు, రైతు కుటుంబ సభ్యులకు మధ్య తోపులాట, తీవ్ర వాగ్వాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో ఏం జరుగుతుందో తెలీక ఎమ్మార్వో ఆఫీసు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.
ఈ క్రమంలో వివాదాస్పద భూమి రిజిస్ట్రేషన్ ను అధికారులు తక్షణమే నిలిపేశారు అధికారులు. భూ రికార్డులు పరిశీలించి బాధితుడికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఎమ్మార్వో.
