పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం.. బయ్యారంలో హై టెన్షన్

పొంగులేటి ఆత్మీయ సమ్మేళనం.. బయ్యారంలో హై టెన్షన్

మహబూబాబాద్ జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆత్మీయ సమ్మేళనానికి వెళ్తున్న కార్యకర్తలు, అభిమానులను ఎ్మమెల్యే హరిప్రియ వర్గీయులు అడ్డుకున్నారు. బయ్యారం, గార్ల మండలాల నుంచి కార్యక్రమానికి తరలివెళ్తున్న వారిని అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లందులో తలపెట్టిన ఆత్మీయ సమ్మేళనానికి భారీగా జనం తరలి వస్తున్నారు. బయ్యారం, గార్ల మండలాలకు చెందిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 1000 మంది కార్యకర్తలు ఆయా పార్టీలకు రాజీనామా చేశారు. పొంగులేటి, కొత్తగూడెం జిల్లా జెడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య వెంట నడుస్తామని అంటున్నారు.