Sankranti 2024 Movies: సంక్రాంతి రేసులో హైయెస్ట్ కలెక్షన్స్తో..సత్తా చాటిన సినిమాలివే..

Sankranti 2024 Movies: సంక్రాంతి రేసులో హైయెస్ట్ కలెక్షన్స్తో..సత్తా చాటిన సినిమాలివే..

శుక్రవారం వస్తేనే సినిమాల పండుగ వస్తోంది. అలాంటిది సంక్రాంతి లాంటి పండుగ వస్తే..ఇక సినిమాల జాతర ఎలా ఉంటుందో ఆడియన్స్ చూస్తున్నారు. టాలీవుడ్ సినిమా లవర్స్ కి కిక్ ఇచ్చే విధంగా పెద్ద హీరోలు..భారీ బడ్జెట్ సినిమాలు..హై రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ సినిమాలు ఇలా ఒక జాతర లాంటి సినీ పండుగే కనిపించింది. 

ఈ ఏడాది సంక్రాంతి పండుగ  రేసులో సౌత్ నుంచి ఏకంగా ఏడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో టాలీవుడ్ నుంచి నాలుగు స్ట్రెయిట్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. తమిళం నుంచి మూడు పెద్ద హీరోల సినిమాలు ఉన్నాయి. ఇందులో ప్రతి ఒక్క మూవీ..దేనికదే అదే ప్రత్యేకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరి ఈ సంక్రాంతి కలెక్షన్ల కింగ్ ఎవరు? ఏ మూవీ టాప్ లెవెల్లో హిట్ అందుకుంది.? అనేది చూద్దాం. 

మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ రూ.140 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుని ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఆ తర్వాత సెకండ్ స్థానంలో యంగ్ హీరో తేజ హనుమాన్ మూవీ రూ.116 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్స్తో థియేటర్లో దూసుకెళ్తోంది. కలెక్షన్స్ పరంగా చూసుకుంటే హనుమాన్ తర్వాత ధనుష్ కెప్టెన్ మిల్లర్ ఇప్పటి వరకు రూ.56 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సినిమా భారీ స్థాయిలో నిర్మించారు. ఆ బడ్జెట్తో పోల్చుకుంటే కలెక్షన్స్ చాలా తక్కువే అయినప్పటికీ..తెలుగులో రిలీజ్ కాకపోవడం వల్ల భారీ కలెక్షన్స్ వసూళ్లు చేయకపోవడం ఒక  కారణం. 

మరో తమిళ సినిమా అయలాన్ మంచి కలెక్షన్స్ రాబడుతోంది. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ మూవీ వంద కోట్లతో నిర్మించారు. ఇప్పటి వరకు అయలాన్ మూవీ రూ.47.7 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక వీటి తర్వాత తెలుగు సినిమా అయిన  నాగ్ నా సామి రంగ మూవీ 20.5 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత విజయ్ సేతుపతి నటించిన మేరీ క్రిస్మస్ 18 కోట్లు, విక్టరీ వెంకటేష్ సైంధవ్ 14.6 కోట్లు కలెక్ట్ చేసి చివరి స్థానంలో నిలిచింది.

ఓవరాల్గా సంక్రాంతి హిట్ మూవీస్ని చూసుకుంటే హనుమాన్, గుంటూరు కారం, నా సామి రంగ ఉండగా..కెప్టెన్ మిల్లర్, అయలాన్ యావరేజ్ కలెక్షన్స్తో పర్వాలేదనే స్థాయిలో ఉన్నాయి. ఇక విజయ్ సేతుపతి మేరీ క్రిస్మస్, వెంకీ సైంధవ్ మూవీ థియేటర్లో తమ జోరుని ప్రదర్శించే అవకాశం తక్కువ స్థాయిలో ఉండటంతో ఫ్యాన్స్ డీలా పడుతున్నారు. మరి రానున్న వీకెండ్లో వెనుకంజలో ఉన్న సినిమాలు  పరుగులు పెట్టె అవకాశం లేకపోలేదు. ప్రస్తుత ఈ కలెక్షన్స్ రోజు రోజుకి మారుతుంటాయనే విషయం ఆడియన్స్ గుర్తుంచుకోవాలి.