2019 హయ్యెస్ట్ పెయిడ్ జాబ్స్ ఇవే

2019 హయ్యెస్ట్ పెయిడ్ జాబ్స్ ఇవే

2019 లో హైయ్యెస్ట్ పెయిడ్ జాబ్స్ ఇవే.. ఫ్రెషర్స్ , మిడిల్ పొజిషన్స్, ఎక్స్‌‌పీరియన్స్‌‌.. ఇలా అన్ని వర్గా లవారి జీతాలను విశ్లేషించిన పలు అధ్యయనాల్లో ఇదే విషయం వెల్లడైంది. గత కొన్నేళ్లుగా ఈ జాబ్సే హాట్ ఫేవరెట్ . కోర్సు, కెరీర్ ఎంపిక చేసుకోవడంలో డైలమాలో ఉన్నవారు సైతం బెస్ట్ కెరీర్‌‌‌‌ను ఎంపిక చేసుకోవడానికి ఇది చక్కటి సమాచారం.

చార్టర్డ్ అకౌంటెంట్

ఇండస్ర్టీతో సంబంధం లేకుండా అన్ని కంపెనీ ల్లో సేవలందించేవారు చార్టర్డ్ అకౌంటెంట్స్. వ్యక్తులు, సంస్థలకు అకౌంటెన్సీ , ఆడిట్, ట్యాక్సేషన్ వంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ అందిస్తారు. ట్యాక్స్ ల నుంచి మనీ ఎలా సేవ్ చేయాలో చెబుతారు. లెక్కలతోమ్యాజిక్ చేస్తూ లెక్కలేనన్ని డబ్బులు సొంతం చే సుకుంటా రు. చట్టంలోని క్లాజ్ లతో కాసులు కురిపిస్తారు. ఇండస్ర్టీలో విస్తృత అవకాశాలున్న చార్టర్డ్ అకౌంటెంట్ కెరీర్ ఎంపిక చేసుకోవాలనే ఆలోచనలో మీరుం టే నిశ్చింతంగా ఎంపిక చేసుకునే కెరీర్ ఇది.

 

ప్యాకేజ్

ఫ్రెషర్స్ : రూ.5.5 లక్షలు

ఇంటర్మీడియట్ : రూ.12.80 లక్షలు

ఎక్స్‌‌పీరియన్స్: రూ.25.70 లక్షలు

ఫ్రీలాన్స్: ట్రాన్సాక్షన్ ను బట్టి లక్షల్లో నే

ఇన్వెస్ట్‌‌మెంట్ బ్యాంకర్

జిందగీ నా మిలేగా దుబారా సినిమాలో హీరో హృతిక్ రోషన్ ఇన్వెస్ట్‌‌మెంట్ బ్యాంకర్‌‌‌‌గా పనిచేస్తూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటా డు. సేమ్ టు సేమ్ అటువంటి లైఫ్‌‌నే లీడ్ చేయాలనుకు నేవారు ఈ కెరీర్‌‌‌‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ ఇన్‌‌స్టి ట్యూషన్స్, క్యాపిటల్ కంపెనీల్లో , కోట్ల కొద్దీ డబ్బును మేనేజ్ చేయడం, మర్జర్స్, ఆక్విజిషన్స్ వంటి కార్యకలాపాలతో కూడిన జాబ్ ఇది. మనీతో మనీ పెం చడమెలాగో ట్రిక్స్ చెబితే చాలు లక్షల్లో ప్యాకేజీలు అందుతాయి. కాస్త ఫైనాన్షియల్ స్కిల్స్ ఉండి ఈ ప్యాకేజీలు చూసిన వారెవరైనా ఈ కెరీర్‌‌‌‌ను వదులుకోరు.

ప్యాకేజ్

ఫ్రెషర్స్ : రూ.12 లక్షలు

ఇంటర్మీడియట్ : రూ.30 లక్షలు

ఎక్స్‌‌పీరియన్స్: రూ.50 లక్షలు

ఆయిల్ & గ్యాస్ ప్రొఫెషనల్స్

ఇంధ న రంగం ఎప్పుడూ ఫేవరెటే. ఎందుకంటే ఏటా దాదాపు 5 శాతం వృద్ధితో ఈ రంగంలో నిపుణుల కొరత ఏర్పడుతోంది. టెక్నాలజీ వాడి తక్కు వ ఖర్చులో ఎక్కు వ ఉత్పత్తి సాధ్యమయ్యేలా చేయగలిగితే లక్షల్లో జీతాలుంటా యి. ఆయిల్, గ్యాస్ నిల్వలు అధికంగా ఉండే మధ్య తూర్పు దేశాలకు వెళ్లడమే కాక ప్రపంచవ్యాప్తంగా కెరీర్స్ ఎంచుకోవచ్చు . ఎకానమీకి లాభం చేకూర్చే ఇంధన ప్రత్యామ్నా యాలు సూచిం చేవారికి డిమాం డ్ అధికం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 శాతం ఇంధన వినియోగం చైనా, భారత్ లో నే కావడంతో ఈ దేశాల్లో జాబ్ లు ఎక్కు వ.

ప్యాకేజ్

ఫ్రెషర్స్ : రూ.3.5 లక్షలు

ఇంటర్మీడియట్ : రూ.8.5 లక్షలు

ఎక్స్‌‌పీరియన్స్: రూ.12–15 లక్షలు

డాక్టర్స్ /మెడికల్ ప్రాక్టీషనర్స్

డౌన్ ఫాల్ లేని ఏకైక కెరీర్ ఏదైనా ఉందంటే అది డాక్టరే అని చెప్పొచ్చు. కొత్త కొత్త వ్యాధుల వ్యాప్తి, ఆరోగ్యం పై ప్రజలకు శ్రద్ధ పెరుగుతుండటంతో వీరి కెరీర్ దినదిన ప్రవర్ధమా నంగా వెలుగొందుతోంది . హెల్త్​కే ర్ బ్రాండ్స్‌‌కు పనిచేయడం వల్ల అధిక జీతాలు పొం దవచ్చు. కెరీర్ ప్రారంభంలో కొం త కఠినంగా అనిపిం చినా సరైన ఎక్స్‌‌పీరియన్స్ పొంది తే తిరుగుం డదు. అందరి జీవితంలో వైద్యం అత్యవసరం కాబట్టి డాక్టర్స్, మెడికల్ ప్రాక్టీషనర్స్‌‌కు కెరీర్ మొత్తం అధిక జీతాలే అందుతున్నా యి.

ప్యాకేజ్

ఫ్రెషర్స్ : రూ.5 లక్షలు

ఇంటర్మీడియట్ : రూ.8–10 లక్షలు

ఎక్స్‌‌పీరియన్స్: రూ.18–20 లక్షలు

యూనివర్శిటీ ప్రొఫెసర్స్

స బ్జెక్టు పై పట్టు ఉండి నెట్ , సెట్ క్వాలిఫై అయిన వారికి బెస్ట్​ జాబ్ ఇది. పీజీ, పీహెచ్ డీతో ఎలిజిబిలిటీ టెస్టు లు క్వాలిఫై అయితే అసిస్టెం ట్ ప్రొఫెసర్ స్థాయిలో కెరీర్ ప్రారంభించొచ్చు. నిరంతర విద్యార్థిగా ఉంటూ కొత్త విషయాలను టీచ్ చేయాలనుకు నేవారికి ప్రొఫెసర్ జాబ్స్ సూటబుల్ . యూనివర్శిటీలు, కాలేజీలతో పాటు స్పెషలైజేషన్లు పెరుగుతున్నందున సబ్జెక్ ట్​ఎక్స్ పర్స్ట్ కి డిమాం డ్ పెరుగుతోంది . గెస్ట్​ ఫ్యాకల్టీగా వెళ్తే రోజుకు వేలల్లో నే రెమ్యునరేషన్ ఉంటుంది . టీచిం గ్ ఫీల్డ్ లో త్వరగా సెటిల్ అవ్వాలనుకు నేవారు నిశ్చింతంగా ఈ కెరీర్ ఎంపిక చేసుకోవచ్చు.

ప్యాకేజ్

ఫ్రెషర్స్ : రూ. 6 లక్షలు

ఇంటర్మీడియట్ : రూ.15 లక్షలు

ఎక్స్‌‌పీరియన్స్: రూ.20 – 24 లక్షలు

పైలట్

థ్రిల్ తో పాటు అధిక వేతనాలు అందిస్తున్న జాబ్ ల్లో పైలట్ ఒకటి. కోర్సుకే లక్షల్లో ఖర్చు పెట్టాల్సి ఉంటుంది . కుటుంబానికి తక్కు వ సమయం కేటాయించాల్సి వస్తుంది . అనుక్షణం అప్రమత్తతతో పనిచేయాలి. అత్యధిక రెస్పాన్సిబిలిటీ కలిగిన జాబ్ కూడా ఇదే. అయినా పర్లేదు అనుకు నేవారికి బెస్ట్​ జాబ్ పైలట్. ప్రపంచాన్ని చుట్టు రావాలనే కుతూహలం ఉంటే ప్రొసీడవ్వం డి మరి.

ప్యాకేజ్

ఫ్రెషర్స్ : రూ. 6 లక్షలు

ఇంటర్మీడియట్ : రూ.12 లక్షలు

ఎక్స్‌‌పీరియన్స్: రూ.15 – 20 లక్షలు

బిజినెస్ అనలిస్ట్

ఎటువంటి బిజినెస్ సమస్యకైనా సొల్యూషన్ ఇవ్వ గలమ ని ఆలోచిస్తున్నా రా ? చిక్కుముడులు విప్పే టాక్‌‌టిక్స్ మీ దగ్గర ఉన్నా యా? అయితే మీరు ఈ కెరీర్ నిశ్చింతగా ఎంపిక చేసుకోవచ్చు. నంబర్లపై మీకున్న మక్కు వే మీకు లక్షల్లో జీతాలు తెచ్చిపెడుతుంది . డేటా అనలైజ్ చేసి, సాధ్యాసాధ్యాలు, భవిష్యత్ అవకాశాలు చెప్పగలిగితే చాలు కొత్త సంస్థలకు మీరు హాట్ కేకే. లాం గ్ టర్మ్ స్ర్టాటజీస్, గోల్స్‌‌ సెట్ చేసుకునేలా మీ ఐడియాలుం డాలి.

ప్యాకేజ్

ఫ్రెషర్స్ : రూ.6 లక్షలు

ఇంటర్మీడియట్ : రూ.8 లక్షలు

ఎక్స్‌‌పీరియన్స్: రూ.12–15 లక్షలు

లాయర్స్ /లీగల్ ఎక్స్‌‌పర్స్ట్

సివిల్ , క్రిమినల్ , వ్యక్తిగత, వ్యాపార, ప్రభుత్వ,ప్రైవేటు, కార్పొరే టు.. ఇలా వివాదం ఏదైనా టక్కు న గుర్తొచ్చేది లాయర్ . న్యా యశాస్ర్తంలో ఎక్స్‌‌పర్ట్​ అయి కోట్లలో ఫీజులు పొం దుతున్న వారు కోకొల్లలు. న్యా యం దక్కాల్సి న వారు కోట్లలో ఉంటే న్యా య నిపుణులు లక్షల్లో కూడా లేరు. లీగల్ ఎక్స్ పర్ట్​ అయితే కెరీర్ సుస్థిరంగా ఉండటమే కాదు అధిక సంపాదన సాధ్యమవుతుంది . సమాజంలో హోదా, డబ్బు, పేరు ప్రఖ్యాతలు అధికంగా ఉండేది ఈ వృత్తిలోనే.

ప్యాకేజ్

ఫ్రెషర్స్ : రూ.4 లక్షలు

ఇంటర్మీడియట్ : రూ.8 లక్షలు

ఎక్స్‌‌పీరియన్స్: రూ.15 లక్షలు

ఇండివిడ్యువల్ లాయర్ : 4 లక్షలు

కార్పొరేట్ లాయర్ : 6 లక్షలు