పడుకోని సిక్స్ కొట్టడమేంది సామీ..!

పడుకోని సిక్స్ కొట్టడమేంది సామీ..!

లంకతో జరిగిన మూడో టీ20లో సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో సునామీ సృష్టించాడు. కేవలం 51 బంతుల్లోనే 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 112 పరుగులు సాధించాడు. లంక బౌలర్లను ఊచకోత కోస్తూ..ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇదే క్రమంలో టీ20ల్లో మూడో సెంచరీ నమోదు చేశాడు. 

ఇదెక్కడి సిక్స్..

తన ఇన్నింగ్స్లో సూర్య కొట్టిన ప్రతీ షాట్ అద్భుమైనదే.  తనకే సాధ్యమైన బ్యాటింగ్‌తో శ్రీలంక బౌలర్లకు సూర్యకుమార్ యాదవ్ చుక్కలు చూపించాడు. ఇక తన ఇన్నింగ్స్లో  సూర్య కొట్టిన ఓ సిక్స్  మ్యాచ్ కే హైలైట్‌గా నిలిచింది. 360 డిగ్రీస్లో  కిందపడుతూ....పల్టీలు కొడుతూ సూర్య కొట్టిన సిక్స్‌ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది. పడుకోని సిక్స్ కొట్టడమేంటి సామీ అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సిక్స్కు సంబంధించిన వీడియో  వైరల్‌ అవుతోంది. 

సూర్య సిక్సర్కు షాక్..

మదుషంక వేసిన 13వ ఓవర్ సెకండ్ బాల్ నే సూర్య సిక్స్గా మలిచాడు. బంతిని ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్  వేస్తాడని గ్రహించిన సూర్య.. స్కూప్ షాట్ ఆడే ప్రయత్నంలో ముందుగా స్టంప్స్ వైపు జరిగాడు. సూర్య జరగడాన్ని గమించిన మదుషంక  తన ప్లాన్ మార్చి వైడ్ ఫుల్‌టాస్ వేశాడు. అయినా సూర్య బంతిని సూపర్ స్కూప్ షాట్‌తో షార్ట్ ఫైన్ దిశగా సిక్సర్ బాదాడు. అయితే షాట్ ఆడే క్రమంలో పూర్తిగా నేలపై పడిపోయా  పల్టీలు కొట్టాడు. ఈ షాట్‌ను చూసిన శ్రీలంక ప్లేయర్లు, గ్రౌండ్ లో ఉన్న ప్రేక్షకులు షాక్కు గురయ్యారు.