హైదరాబాద్ లో హైలాండ్ ఆఫీసు ప్రారంభం

హైదరాబాద్ లో హైలాండ్ ఆఫీసు ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు: కంటెంట్ ఇన్నోవేషన్ క్లౌడ్ కంపెనీ హైలాండ్, హైదరాబాద్‌‌‌‌లో తమ కొత్త  ఆఫీసును ప్రారంభించింది. ఇది కంపెనీ ప్రపంచ విస్తరణ వ్యూహంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని పేర్కొంది. ఇక్కడి నుంచి ఆసియా, పసిఫిక్ ప్రాంత కస్టమర్లకు సేవలను అందిస్తుంది. 

ఆఫీసు ప్రారంభోత్సవంలో హైదరాబాద్​లోని యూఎస్​ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ పాల్గొన్నారు. హైదరాబాద్‌‌‌‌లోని హైటెక్ సిటీ మధ్యలో ఉన్న ఈ కొత్త ఫెసిలిటీ కంటెంట్, ఇన్నోవేషన్ క్లౌడ్‌‌‌‌ను అభివృద్ధి చేయడంలో కీలకమని హైలాండ్​ తెలిపింది.