
పెళ్లి అంటే వెడ్డింగ్ కార్డుల దగ్గర నుంచి కొత్త రకమైన బట్టలు.. ఆభరణాలతో ట్రెండింగ్ అవుతాయి. మొన్నటికి మొన్న అంబానీ భార్య నీతా అంబానీ డ్రస్ తెగ వైరల్ కాగా.. ఇప్పుడు ఓ వెడ్డింగ్ కార్డ్ వైరల్ అవుతుంది. 2025లో జరిగే పెళ్లికి ఇప్పటి నుంచే ఆహ్వానాలు పంపుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే ...
సహజంగా పెళ్లి వెడ్డింగ్ కార్డును వారమో లేకపోతే పది రోజుల ముందో బంధువులకు,స్నేహితులకు పంపుతారు. ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిన తరువాత రెండు మూడు రోజుల ముందు వాట్సప్, ఫేస్ బుక్ ద్వారా ఆహ్వానాలు పంపుతున్నారు. అయితే తాజాగా 2025లో జరిగే పెళ్లికి ఇప్పటి నుంచే ఆహ్వానాలను పంపుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వెడ్డింగ్ కార్డును చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.
ఇంతకీ అందులో ఏముందంటే..
అతిథులు వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించాలని ఆ కుటుంబ సభ్యులు కోరుకుంటారు. అయితే ఈ వివాహ ఆహ్వాన పత్రిక చూస్తే పెళ్లికి వెళ్లకూడదనే విధంగా... వచ్చే అతిథులు 100 సార్లు ఆలోచించి రావాలని కండిషన్ పెట్టారు. దీనిని చూసిన నెటిజన్లు ఇంత చెత్త పెళ్లి కార్డు ఎక్కడా చూడలేదని కామెంట్స్ పెడుతున్నారు. వధూవరులు చూడ్డానికి వింతగా ఉన్నారంటూ.. మూడేళ్ల తరువాత జరిగే పెళ్లికి ఇప్పుడెందుకు ఆహ్వానాలంటూ.. చాలామంది ఫేస్ బుక్ లో వ్యంగ్యంగా సెటైర్లు వేస్తున్నారు. ఆహ్వాన పత్రికే కాదు.. పెళ్లికి పిలవడం కూడా అవమానకరంగా ఉందంటున్నారు.
అతిథులకు డ్రస్ కోడ్
ఈ పెళ్లికి వచ్చే వారు డ్రస్ కోడ్ పాటించాలని ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు. తెల్లని దుస్తులు ధరించాలని వెడ్డింగ్ కార్డులో తెలిపారు. ఊదా. నలుపు రంగు డ్రస్ వేసుకొని రావద్దని కార్డ్ లో ప్రింట్ చేయించారు.
కుర్చీ, శాండ్ విచ్ తెచ్చుకోండి
పిల్లలను తీసుకొస్తే బేబీలు కూర్చొనేందుకు కుర్చీలు కూడా తెచ్చుకోమని శుభలేఖలో రాశారు. మళ్లీ ఈ విషయాలన్నీ ఏప్రిల్ 2025లో గుర్తుచేస్తామని కాబోయే దంపతులు తెలిపారు. అంతే కాదు..తినడానికి శాండ్ విచ్ కూడా తెచ్చుకోండి అని శుభలేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. ఏదైనా ఫంక్షన్ అంటే యూత్ కోసం ధావత్ ఏర్పాటు చేస్తారు. ఇక్కడ అలాంటివి ఏమీ ఉండవు. మద్యం తాగేందుకు అనుమతి లేదంటూ ఓ చెత్త వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.