V6 News

హిమాచల్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్, ఆయన కొడుకుకి కోర్టు సమన్లు

హిమాచల్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్, ఆయన కొడుకుకి  కోర్టు సమన్లు

హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్, ఆయన కుమారుడు ఎమ్మెల్యే విక్రమాదిత్య సింగ్ లకు న్యాయస్థానం సమన్లు జారీచేసింది. విక్రమాదిత్య సింగ్ భార్య సుదర్శన సింగ్ చుండావత్ తన ఫిర్యాదులో ప్రతిభా సింగ్ , కోడలు అపరాజిత, బావ అంగద్ సింగ్ గృహ హింస, వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో ప్రతిభా సింగ్ కీలక పాత్ర పోషించారు. సీఎం బరిలో నిలిచి ముఖ్యమంత్రి పీఠం కోసం తీవ్రంగా ప్రయత్నించారు. గత ఏడాది ఆమె భర్త  వీర భద్రసింగ్ మరణం తర్వాత మండి నుంచి లోక్ సభ ఎంపీగా ఎన్నికయ్యారు. 

రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ కు చెందిన చుండావత్, ఛండీఘఢ్ కు చెందిన అమ్రీన్ అనే మహిళతో తన భర్తకు వివాహేతర సంబంధం ఉందని ఆరోపించారు. ఈ మేరకు సుదర్శన సింగ్ చుండావత్ విక్రమాదిత్య సింగ్ నుంచి భరణం కోసం డిమాండ్ చేశారు. తనపై నిఘా ఉంచేందుకు తన గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని ఆరోపించారు. జనవరిలో ఉదయ్ పూర్ కోర్టు ముందు హాజరుకావాలని విక్రమాదిత్య సింగ్ ను ఆదేశించింది. 

భరణం కేసులో ఫ్యామిలీ కోర్టు విక్రమాదిత్యకు సమన్లు జారీ చేసింది. విక్రమాదిత్య, చుండావత్ లకు 2019లో అంగరంగవైభవంగా పెళ్లి జరిగింది. కొన్నాళ్లు అన్యోన్యంగా సాగిన వారిద్దరి దాంపత్యంలో గొడవలు స్టార్ట్ అయ్యాయి. దీంతో భర్త విక్రమాదిత్య తనను గృహహింస,వేధింపులకు పాల్పడుతున్నారని భార్య కోర్టును ఆశ్రయించారు.