టాయిలెట్‪పై ట్యాక్స్.. ఎక్కడో కాదండోయ్ మన దేశంలోనే

టాయిలెట్‪పై ట్యాక్స్.. ఎక్కడో కాదండోయ్ మన దేశంలోనే

పన్ను కట్టందే గాలి కూడా పీల్చలేం ఇండియాలో అలాంటి రోజులు వస్తాయన్నా అనుమానం లేదు. చిన్న చాక్లెట్ నుంచి నిత్యవసర వస్తువుల దాకా ఏది కొనాలన్నా ట్యాక్స్ కట్టాల్సిందే. ఆదాయపు పన్ను, వస్తువులు, సేవల పన్ను, ఇంటి పన్ను అంతటితో ఆగకుండా ఇప్పుడు టాయిలెట్ సీట్ పన్ను కూడా విధిస్తున్నారు. అవును మీరు విన్నది నిజమే.. అది కూడా ఎక్కడో బయటి దేశంలో కాదు.. మనం భారత దేశంలోనే. ఆ టాయిలెట్ సీట్ ట్యాక్స్ ఎక్కడ విధిస్తున్నారు. ఎలా విధిస్తున్నారు అనే దాని గుర్తించి తెలుసుకుందాం రండీ..

హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని పట్టణల్లో నివసించే వారి ఇళ్లలో టాయిలెట్ సంఖ్య ఆధారంగా పన్ను విధించాలని నిర్ణయించింది. అక్కడ ఉచిత సంక్షేమ పథకాలు పెరుగుతుండటం వల్ల.. రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతుంది. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నివేదికల ప్రకారం.. పట్టణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు తమ ఇళ్లలో టాయిలెట్ సీటుకు రూ.25 పన్ను చెల్లించాలని ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు మురుగునీరు మరియు నీటి బిల్లును పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ అదనపు పన్ను మురుగునీటి బిల్లుతో పాటు జలశక్తి శాఖకు బదిలీ చేయబడుతుంది. 

ALSO READ | ప్రతి నెలా చివరికల్లా పెన్షన్ ఇవ్వండి .. బ్యాంకులకు కేంద్రం ఆదేశం

ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం.. నీటి బిల్లులో 30 శాతం మురుకినీటి బిల్లును నిర్ణయిస్తారు. సొంతంగా నీటిని పొందేవారికి లేదా ప్రభుత్వం సౌకర్యాలు పొందే వారికి డ్రైనేజ్ కనెక్షన్ ఉన్నవారు వాటితో పాటు నెలకు రూ.25 లు టాయిలెట్ సీట్ పన్ను చెల్లించారు. ఒక ఇంట్లో రెండు టాయిలెట్ బెసిన్లు ఉంటే నెలకు రూ.50 లు ట్యాక్స్ కట్టాలి. ఈ ఆదేశాలను అమలు చేయాలని అన్ని డివిజనల్ అధికారులను శాఖ ఆదేశించింది.

గతంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్వాసితులకు నీరు ఉచితంగా అందేది. అక్టోబర్ నుంచి ప్రతి నెలా కనెక్షన్‌కు రూ.100 నీటి బిల్లు వసూలు చేయాలని సుఖూ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2023 నాటికి హిమాచల్ ప్రభుత్వ అప్పు రూ.76,651 కోట్లకు పెరిగాయి.