ప్లాస్టిక్‌‌ చెత్తను కొంటాం: హిమాచల్‌‌ సర్కారు నిర్ణయం

ప్లాస్టిక్‌‌ చెత్తను కొంటాం: హిమాచల్‌‌ సర్కారు నిర్ణయం

తమ స్టేట్‌‌లో చెత్తనేదే లేకుండా చేసేందుకు ఆ రాష్ట్ర సర్కారు పని మొదలుపెట్టింది. రాష్ట్రంలో ఉన్న రీ సైకిల్‌‌ చేయలేని ప్లాస్టిక్‌‌ను కొనేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు డ్రాఫ్ట్‌‌ పాలసీని సిద్ధం చేసింది. కేబినెట్‌‌ కూడా ఆమోదించింది. త్వరలోనే రాష్ట్రమంతా అమలు చేయనున్నారు. పాలసీ ప్రకారం అర్బన్‌‌ లోకల్‌‌ బాడీల నుంచి రీ సైకిల్‌‌ చేయలేని ప్లాస్టిక్‌‌ను కిలో రూ.75కు సర్కారు కొంటుందని హిమాచల్‌‌ స్టేట్‌‌ పొల్యూషన్‌‌ కంట్రోల్ బోర్డు చైర్మన్‌‌ ఆర్డీ ధిమన్‌‌ చెప్పారు. 54 యూఎల్‌‌బీల్లో ప్లాస్టిక్‌‌ కొనే కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.

రాష్ట్రంలో ఇప్పటికే ప్లాస్టిక్‌‌ను బ్యాన్‌‌ చేశామని, కానీ టూరిస్టులు ప్లాస్టిక్‌‌ బాటిళ్లు,  వస్తువులను ఎక్కడబడితే అక్కడ పడేస్తుండటంతో చెత్త ఎక్కువవుతోందని చెప్పారు. ఆ ప్లాస్టిక్‌‌ కనబడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కొన్న ప్లాస్టిక్‌‌ను పబ్లిక్‌‌ వర్క్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌కు ఇస్తామని, దానికి బిట్యుమిన్‌‌ను కలిపి రోడ్లేస్తారని వివరించారు. ప్లాస్టిక్‌‌ను సిమెంట్‌‌ కంపెనీలు ఫ్యూయెల్‌‌గా వాడతాయని, వాటికీ అమ్ముతామని చెప్పారు. 2009 అక్టోబర్‌‌ 2నే పాలిథీన్ బ్యాగులను హిమాచల్‌‌ సర్కారు బ్యాన్‌‌ చేసింది.