హిమాయత్ సాగర్ 4 గేట్లు ఓపెన్

హిమాయత్ సాగర్ 4 గేట్లు ఓపెన్

హైదరాబాద్ సిటీ, వెలుగు: జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్ సాగర్ నాలుగు గేట్లను అధికారులు ఒక అడుగు మేర ఎత్తారు. హిమాయత్ సాగర్ కు భారీగా వరద నీరు చేరుతుండటంతో మెట్రో వాటర్ బోర్డు అధికారులు గురువారం రాత్రి 10 గంటలకు ఒక గేట్ ఒక అడుగు ఎత్తి మూసీలోకి నీటిని వదిలారు. శుక్రవారం ఉదయం వరకు వరద భారీగా చేరుతుండటంతో అధికారులు మరో మూడు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి నీటిని వదిలారు.

 హిమాయత్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 1763.50అడుగులు కాగా ప్రస్తుతం 1763.20 అడుగులకు చేరింది. ప్రస్తుతం ఈ జలాశయంలోకి ఇన్ ఫ్లో 1,300 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 1,391 క్యూసెక్కులు ఉంది. ఇక ఉస్మాన్ సాగర్​లోకి కూడా వరద వస్తూనే ఉంది. ఈ జలాశయం ఫుల్ ట్యాంక్ లెవెల్ 1790అడుగులు కాగా ప్రస్తుతం 1783.30 అడుగులు ఉంది.