
గండిపేట, వెలుగు: ఎగువ నుంచి సిటీ జంట జలాశయాలకు వరద క్రమంగా తగ్గుతోంది. మొన్నటి వరకు హిమాయత్‌సాగర్ నాలుగు గేట్లు తెరిచి నీటిని మూసీలోకి వదలగా, ప్రస్తుతం ఒక గేటును ఒక అడుగు మేర తెరిచి నీటిని వదులుతున్నారు. హిమాయత్ సాగర్ నీటి మట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం 1762.25 అడుగులుగా చేరింది. ఇన్ ఫ్లో 200, ఔట్ ఫ్లో 339 క్యూసెక్కులుగా ఉంది.