కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు : సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని, దీని కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని బీజేపీ మధ్యప్రదేశ్ ఇన్ చార్జి మురళీధర్ రావు అన్నారు. మంగళవారం సిరిసిల్ల లో నిర్వహించిన డిజిటిల్ హిందూ కన్​క్లేవ్ కార్యక్రమంలో దాదుజీ మహారాజ్ స్వామితో కలిసి మాట్లాడారు. హిందూ ఇజం అంటే పద్ధతిగా బతకడమేనని, ప్రపంచ దేశాలలో భారతదేశ చరిత్ర పురాతనమైనదన్నారు. అనంతరం దాదుజీ మాట్లాడుతూ ధర్మాన్ని కాపాడితేనే మనం బాగుంటాం అని అన్నారు. దేశ ఆచారాలు చాలా గొప్పవని, విభిన్న భాషల సముదాయం ఉన్నా మన భావాలన్ని ఒక్కటిగానే ఉంటాయన్నారు. అనంతరం సినీనటి పూనం కౌర్​మాట్లాడుతూ చేనేత  అంటే బట్టకాదని, అది సంస్కృతి అని అన్నారు. కార్యక్రమంలో పొలిటికల్ అనలిస్ట్ శ్రీరాం, సోషల్ అక్టివిస్ట్ గిరీశ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, లీడర్లు పాల్గొన్నారు. 

సీఎంను బద్నాం చేసే ప్రయత్నం

జగిత్యాల, వెలుగు: ఎమ్మెల్సీ కవితపై లిక్కర్ స్కాం ఆరోపణలు చేస్తూ సీఎం కేసీఆర్ ను బీజేపీ లీడర్లు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడికి రావడాన్ని ఖండిస్తూ మంగళవారం జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఆయన మాట్లాడారు. బీజేపీ లీడర్లు తీరుతో తెలంగాణలో శాంతి భద్రతలు విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కార్యక్రమం లో పార్టీ పట్టణ ప్రెసిడెంట్ సతీశ్, మండల ప్రెసిడెంట్ ముకుందం, మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఖాదర్ ముజాహిధ్ పాల్గొన్నారు  
కరీంనగర్​టౌన్: ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడికి యత్నాన్ని నిరసిస్తూ మంగళవారం నగర మేయర్ యాదగిరి సునీల్ రావు ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణ చౌక్ లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ టీఆర్ఎస్ చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపి శ్రేణులు కవిత ఇంటిపై దాడికి యత్నించారని ఆరోపించారు. అంతకుముందు తెలంగాణ చౌక్ కు ర్యాలీగా వచ్చి కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు.

సిరిసిల్ల టౌన్​: ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడికి యత్నించడం శోచనీయమని టీఆర్ఎస్ జిల్లా ప్రెసిడెంట్ టి.ఆగయ్య అన్నారు. మంగళవారం సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రి అమిత్ షా హోంమంత్రిగా ఉండి ఇలాంటి దాడులను ప్రోత్సహించడం సరికాదన్నారు. సమావేశంలో సిరిసిల్ల పట్టణ ప్రెసిడెంట్ చక్రపాణి, వైస్  ప్రెసిడెంట్ సంజీవ్ గౌడ్, గ్రథాలయ చైర్మన్ శంకరయ్య, జిల్లా రైతు సమన్వయ సమితి ప్రెసిడెంట్ నర్సయ్య, లీడర్లు ఉన్నారు. 

మోటార్లకు మీటర్లు పెడుతమని చెప్పలే

మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయం

గంభీరావుపేట, వెలుగు: పొలాల వద్ద రైతుల మోటార్లకు మీటర్లు పెడతామని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ లీడర్​కటకం మృత్యుంజయం అన్నారు. మంగళవారం గంభీరావుపేటలో  నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మునుగోడు లో బీజేపీ గెలిస్తే మోటార్లకు మీటర్లు పెడతారని సీఎం కేసీఆర్ ప్రజలను ఉసిగొల్పే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కానీ కేసీఆర్​మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. బండి సంజయ్ ని అరెస్టు చేసి కరీంనగర్ కు తరలించారని, అసలు తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. సమావేశంలో ఎంపీటీసీ రాజేందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కృష్ణ కాంత్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

55 సెంటర్లలో ప్రిలిమ్స్ ఎగ్జామ్

కరీంనగర్​టౌన్, వెలుగు: ఆగస్టు 28న జరగనున్న కానిస్టేబుల్ అభ్యర్థుల ప్రిలిమ్స్ రాత పరీక్ష కోసం జిల్లాలో 55 కేంద్రాలను ఏర్పాటు చేశామని కరీంనగర్ సీపీ సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఇన్విజిలేటర్లు, అబ్జర్వర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బయోమెట్రిక్ విధానం ద్వారా అభ్యర్థుల హాజరు తీసుకుంటామన్నారు. 27 వేలకు పైగా అభ్యర్థులు హాజరవుతారని, పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు జరుగుతుందన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు ఉదయం 9 గంటల వరకు చేరుకోవాలని కోరారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ చంద్రమోహన్, రీజినల్ కో- ఆర్డినేటర్లు శ్రీలక్ష్మి, సతీశ్, ఇన్​స్పెక్టర్లు లక్ష్మీనర్సయ్య, పుల్లయ్య, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్రోత్సాహంతోనే లాఠీచార్జి

కార్మిక సంఘాల జేఏసీ ఆరోపణ

జ్యోతినగర్, గోదావరి ఖని, వెలుగు: రామగుండం ఎన్టీపీసీ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్రోత్సాహంతోనే కాంట్రాక్ట్ కార్మికులపై సీఐఎస్‌‌‌‌ఎఫ్ పోలీసులు లాఠీ చార్జి చేశారని కార్మిక సంఘాల జేఏసీ లీడర్లు, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆరోపించారు. మంగళవారం ఎన్టీపీసీ లేబర్‌‌‌‌ గేట్‌‌‌‌ వద్ద, ఎన్టీపీసీ కృష్ణానగర్ లో  ఏర్పాటు చేసిన సమావేశంలో నల్ల బ్యాడ్జీలు ధరంచి వారు మాట్లాడారు. కార్మికులకు న్యాయం జరిగేంత వరకు నిరసన వ్యక్తం చేస్తామన్నారు. సీఐఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ చర్యలపై కేంద్ర విద్యుత్‌‌‌‌ శాఖ మంత్రికి, హోంమంత్రికి ఫిర్యాదు చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌‌‌ మాట్లాడుతూ 2018లో చేసుకున్న ఆగ్రిమెంట్‌‌‌‌ను ఎన్టీపీసీ యాజమాన్యం అమలు చేయాలని అన్నారు. సమావేశంలో బీజేపీఎస్సీ మోర్చా సభ్యులు మల్లేశ్‌‌‌‌, మీడియా సెల్‌‌‌‌ రాష్ట్ర కన్వీనర్‌‌‌‌ విజయ్‌‌‌‌, అధికార ప్రతినిధి లక్ష్మీనర్సయ్య, బీజేపీ నేత కౌశిక హరి, మక్కాన్‌‌‌‌సింగ్‌‌‌‌, శంకర్, రామగుండం కార్పొరేషన్‌‌‌‌ డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు తదితరులు పాల్గొన్నారు.

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

గంగాధర, వెలుగు : మండలంలోని రంగారావుపల్లి ఎస్సారెస్పీ వరద కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం గుర్తించామని ఎస్సై రాజు మంగళవారం తెలిపారు. మృతుడి వయసు సుమారు 35 నుంచి 40 ఏళ్లు ఉంటుందని, కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని కరీంనగర్ సివిల్ హాస్పిటల్ మార్చురీకి తరలించామన్నారు. వివరాలకు 94409 00981 నంబర్​పై సంప్రదించాలని కోరారు.

స్కూల్ లో సౌకర్యాలు కల్పించండి

సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు పేరెంట్స్ ధర్నా

మెట్ పల్లి, వెలుగు : కోరుట్ల నియోజకవర్గం అయిలాపూర్ జ్యోతిబా పూలే రెసిడెన్షియల్ స్కూల్ లో సౌకర్యాలు కల్పించాలాని స్టూడెంట్స్ తల్లిదండ్రులు మంగళవారం మెట్ పల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెసిడెన్షియల్ స్కూల్ లో మూడేళ్లుగా వసతులు లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పలుమార్లు కలెక్టర్, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని అవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉన్న బిల్డింగ్ పై ఆర్డీఓ ఇచ్చిన తప్పుడు నివేదికపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ధర్నాలో గంగరాజం, ధనుంజయ్, పద్మ, లస్మయ్య, శంకర్, నవీన్ తదితరులు ఉన్నారు. 

‘బండి’ అరెస్ట్​పై బీజేపీ లీడర్ల ఆందోళన

వెలుగు, నెట్​వర్క్​ :బీజేపీ స్టేట్​లీడర్​బండి సంజయ్ అరెస్ట్ ను, ఎమ్మెల్సీ కవిత ఇంటిని ముట్టడించేందుకు వెళ్లిన లీడర్లను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఉమ్మడి కరీంనగర్​జిల్లాలోని పలుచోట్ల మంగళవారం బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాలలోని తహసీల్ చౌరస్తా వద్ద నిరసన తెలిపి ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. సిరిసిల్ల టౌన్ లో బీజేవైం టౌన్ ప్రసిడెంట్ భాస్కర్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. కోనరావుపేట మండలం మల్కపేటలో బీజేపీ మండలాధ్యక్షుడు రామచంద్రం లీడర్లతో కలిసి సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో మండలాధ్యక్షుడు జక్రయ్య ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. చొప్పదండిలో బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షులు ప్రశాంత్ అధ్వర్యంలో గుమ్లాపూర్​ చౌరస్తా వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా ఎస్సై ఉపేంద్ర అడ్డుకున్నారు. చిగురుమామిడి అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. మెట్ పల్లి డిపో వద్ద బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రభాకర్ ఆందోళన చేశారు. దీంతో పోలీసులు లీడర్లను మల్లాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సమీపంలోని రాజీవ్‌‌‌‌ రహదారిపై బీజేపీ స్టేట్​లీడర్​కౌశిక హరి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు రాస్తారోకో చేపట్టారు. ‌‌వేములవాడ పట్టణంలోని బీజేపీ ఆఫీస్​లో పట్టణ శాఖ అధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.

కవిత వెంటనే రాజీనామా చేయాలి

ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కోరుట్ల, కథలాపూర్​లోని బీజేపీ , బీజెవైఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. లీడర్లను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి కథలాపూర్​ పోలీస్​స్టేషన్​కు తరలించగా అక్కడ వారు నల్ల బ్యాడ్జీలు ధరించి మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్​మోర్చా
 జగిత్యాల జిల్లా ప్రెసిడెంట్ కొడిపెల్లి గోపాల్​రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కుటుంబం సంపాదన ధ్యేయంగా స్కాములు చేస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. ఇకపై వారి ఆగడాలు సాగవని ఖబడ్దార్ అంటూ గోపాల్ రెడ్డి హెచ్చరించారు. అరెస్ట్ అయిన వారిలో కోరుట్ల మున్సిపల్ కౌన్సిలర్ మాడవేణి నరేశ్, లీడర్లు సత్యం, మహేశ్, శ్రీనివాస్, మారుతి తదితరులు ఉన్నారు. 

రైలు కింద పడి వ్యక్తి మృతి

కాల్వ శ్రీరాంపూర్, వెలుగు: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్, కొత్తపల్లి  రైల్వేస్టేషన్ల నడుమ ఉప్పరపల్లి రైల్వే ట్రాక్ పక్కన గుర్తు తెలియని మృతదేహాన్ని మంగళవారం రైల్వే పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చనిపోయిన వ్యక్తి రైలు నుంచి కింద పడి ఉంటాడని అన్నారు. మిగతా వివరాలు తెలియరాలేదని, గోదావరిఖని హాస్పిటల్​మార్చురీలో మృతదేహాన్ని ఉంచామని పోలీసులు తెలిపారు. మృతుడు రోజ్ కలర్ ఫుల్​షర్ట్, బ్లూ కలర్ షార్ట్ ధరించినట్లు తెలిపారు. వివరాలు తెలిసినవారు 94407 00039 కు సమాచారం ఇవ్వాలని రైల్వే పోలీస్​తిరుపతి తెలిపారు.

కొండగట్టులో భక్తుల రద్దీ

ఒక్కరోజే రూ.10 లక్షల ఆదాయం

కొండగట్టు, వెలుగు : జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న సన్నిధి మంగళవారం భక్తులతో కిక్కిరిసింది. సుమారు 50 వేలకు పైగా భక్తులు అంజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించినట్లు టెంపుల్ ఏఈఓ బుద్ది శ్రీనివాస్ తెలిపారు.  శ్రావణమాసం చివరి మంగళవారం కావడంతో భారీగా భక్తులు వచ్చారని, సుమారు రూ.10 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. సూపరింటెండెంట్​శ్రీనివాస శర్మ, సునీల్ ఏర్పాట్లు పరిశీలించారు.

రాజాసింగ్ పై క్రిమినల్​కేసు నమోదు చేయాలి

మెట్​పల్లిలో ముస్లింల ఆందోళన

మెట్ పల్లి, వెలుగు : ముస్లింల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మంగళవారం మెట్ పల్లి పట్టణంలో ముస్లింలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాజాసింగ్ దిష్టిబొమ్మను దహనం చేయడానికి తీసుకువస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ముస్లింలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో వారు రోడ్డుపై బైఠాయించి రాజా సింగ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు స్థానిక బిస్మిల్లా మసీదు వద్ద యువకులు సమావేశం నిర్వహించి రాజాసింగ్ దిష్టిబొమ్మ దహనం చేయాలని తీర్మానించారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఆందోళన చేయకుండా అడ్డుకున్నారు. డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ శ్రీనివాస్ వారిని సముదాయించారు. అనంతరం రాజాసింగ్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో ఎంఐఎం పట్టణాధ్యక్షుడు ఆఖీల్, ఖాజా అజీం, ఎండీ రయీస్, ఎండీ ఖలీమ్, ఘని రహ్మాన్, ఖుతుబ్, యాసిన్, ముజ్జు, ఏజాజ్, షఫీ తదితరులు పాల్గొన్నారు.

కేసీఆర్ పాలనలోనే అభివృద్ధి 

చిగురుమామిడి, వెలుగు: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే గ్రామాల అభివృద్ధి జరుగుతోందని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్​కుమార్ వివరించారు. మంగళవారం మండల కేంద్రంలో రూ.31 లక్షల వ్యయంతో నిర్మించిన చిగురుమామిడి జీపీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా 32 మందికి 9 లక్షల 23వేల విలువ గల సీఎం రిలీఫ్​ఫండ్​చెక్కులు, 13 మందికి13 లక్షల విలువ గల కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడారు. అనంతరం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్​ప్రారంభిచారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, లీడర్లు పాల్గొన్నారు.