హైబ్రిడ్ భరతనాట్యం ఎలా ఉంటుందో చూశారా ?

హైబ్రిడ్ భరతనాట్యం ఎలా ఉంటుందో చూశారా ?

భారతీయ నాట్య విధానాలన్నింటిలోనూ భరత నాట్యానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. విస్తృత భంగిమలతో హావ, భావాలను వ్యక్తపరుస్తూ శాస్త్రీయ నృత్య విధానంతో అందరినీ ఆకట్టుకునే భరత నాట్యం గురించే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే హిప్ హాప్ డ్యాన్స్ గురించి చెప్పాలంటే నేటి జనరేషన్ కి దగ్గరగా.. మోడ్రన్ గా స్టెప్పులు వేయడం ఈ నృత్యం ప్రత్యేకత. అయితే ఈ రెండూ వేటికవే గొప్పవే. కానీ ఒకదానితో ఒకటి పొంతనే ఉండదు. కాగా మరి ఈ రెండు డ్యాన్స్ కలిపి ఒకే నృత్యంలో ఉంటే... వినడానికే కొత్తగా ఉంటే.. చూడడానికి ఇంకెంత కొత్తగా ఉంటుందో కదా. అలాంటి ప్రయోగమే చేశారు పారిస్ కు చెందిన కొరియోగ్రాఫర్ ఉషా జే. ముగ్గురు నర్తకిలతో భరతనాట్యంలోని వివిద భంగిమలతో పాటు, హిప్ అప్ లోని పలు స్టెప్పులను వేస్తూ అదరగొట్టే వీడియో ఒకటి ఆమె రీసెంట్ తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈ రకమైన నృత్యానికి ఉషా జే ఓ పేరును కూడా పెట్టారట.. అదే హైబ్రిడ్ భరతనాట్యం. ఇప్పటికే ఈ వీడియో 25లక్షలకు పైగా వ్యూస్ రాగా.. నెటిజన్స్ ప్రశంసలతో మోరుమోగుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ వీడియోను చూసి ఎలా ఉందో చెప్పండి. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Usha Jey (@usha_jey)

 

మరిన్ని వార్తల కోసం...

బోర్డర్ లో పాక్ డ్రోన్ కలకలం

శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం