డిసెంబర్ 2.. 'హిట్ 2'

డిసెంబర్ 2.. 'హిట్ 2'

టాలీవుడ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం 'హిట్ 2' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమా నుండి తాజాగా టీజర్ ను వదిలారు. టీజర్ లో పోలీస్ ఆఫీసర్ గా ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ లో అడివి శేష్ కనిపిస్తున్నాడు. ఒక యువతి మర్డర్ కేసును పోలీస్ ఆఫీసర్ గా అడివి శేష్ ఎలా ఛేదించాడు అనేదే కథ. సరిగ్గా ఆ పాయింటు పైనే టీజర్ ను కట్ చేశారు. ఈ టీజర్ సినిమాపై మరింత ఆసక్తినిరేపుతోంది.

గతంలో విష్వక్సేన్ హీరోగా 'హిట్' సినిమాను నిర్మించిన నాని, ఆ సిరీస్ లో భాగంగా 'హిట్ 2'ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నాడు. జాన్ స్టీవర్ట్ ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఈ సినిమాకు శైలేశ్ కొలను దర్శకత్వం వహించాడు. అడివి శేష్ కు జోడీగా మీనాక్షి చౌదరి నటించగా,రావు రమేశ్ ఒక కీలకమైన పాత్రను పోషించాడు.