
- వెల్లడించిన పోలీసులు
- కేసులో ఎవ్వర్నీ కాపాడాలని చూడటం లేదని వెల్లడి
హైదరాబాద్: మాదాపూర్ లో ఆదివారం మధ్యాహ్నం బీభత్సం సృష్టించిన ఫెరారీ కారు.. మేఘ ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ శంకర్ ప్రసాద్ కు సంబంధించినదిగా తెలిపారు మాదాపూర్ సీఐ రవీంద్ర కుమార్. మధ్యాహ్నం 3:30 నిమిషాల ప్రాంతంలో మాదాపూర్ 100 ఫీట్ రోడ్డులో ఫెరారీ కారు అతివేగంగా ఢీకొట్టడంతో యేసుబాబు అనే వ్యక్తి మృతి చెందాడని, మరో వ్యక్తి గాయపడ్డాడని తెలిపారు
డ్రైవర్ నవీన్ కుమార్ నిర్లక్ష్యంతో కారు నడిపాడని, అతన్ని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. మృతుడి బంధువులు ఆరోపించినట్లు కేసు తారుమారు చేసే అవకాశం లేదని, ప్రస్తుతం డ్రైవర్ తమ అదుపులోనే ఉన్నాడన్నారు. ప్రమాద సమయంలో డ్రైవర్ మద్యం సేవించి లేడని , ఈ ప్రమాద ఘటన పై విచారణ చేస్తున్నామని సీఐ రవీంద్ర కుమార్ చెప్పారు.