హ్యాట్సాఫ్​ హితల్స్ ఆర్ట్

హ్యాట్సాఫ్​ హితల్స్ ఆర్ట్

డు ఇట్​ యువర్​సెల్ప్ (డి.ఐ.వై.​) క్రాఫ్ట్స్​ను ఇష్టపడని వాళ్లు ఉండరు. పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ ఈజీగా వీటిని చేయగలరు. కానీ, క్రియేటివ్ ఐడియాలు రాకపోవచ్చు. అలాంటివాళ్లు యూట్యూబ్ ఓపెన్​ చేసి వాళ్లకు కావాల్సిన ఐటమ్​ ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలి? అని వెతుకుతారు. అందులో చూసి వాళ్లు కూడా చేస్తుంటారు. అందుకే డి.ఐ.వై. వీడియోలకు చాలామంది వ్యూయర్స్ ఉంటారు. అలాంటివి ఇంట్రెస్ట్ ఉన్న ఆడియెన్స్​ కోసమే హితల్ అనే ఆమె యూట్యూబ్ ఛానెల్​ స్టార్ట్ చేసింది. తనకు తెలిసిన ట్రిక్స్​తో హోమ్​ మేడ్ ఐటమ్స్ తయారుచేస్తూ వ్యూయర్స్​ని సంపాదించుకుంది. ఆమె​ సక్సెస్​ స్టోరీ...

హితల్స్ ఆర్ట్ అనేది మనదేశంలోనే పాపులర్​ అయిన డి.ఐ.వై. లేదా క్రాఫ్ట్ ఛానెల్. దీన్ని 2011లో మొదలుపెట్టింది హితల్. ఇది తన పేరు మీదే హితల్స్ ఆర్ట్ అని మొదలుపెట్టింది. కానీ, చాలామంది దీన్ని చేస్తుంటారు. ప్రస్తుతం ఈ ఛానెల్​కి 7.32 మిలియన్ సబ్​స్క్రయిబర్స్ ఉన్నారు. ఈ ఛానెల్​లో ఆర్ట్​కి సంబంధించినవి తయారుచేస్తుంటుంది. వాటిలో ఇంట్లో తయారు చేసే జువెలరీ చాలా పాపులర్ అయింది. వీటికోసం ఆడవాళ్లు ఎక్కువగా వెతుకుతుంటారు.

 కాబట్టి ఆడియెన్స్​కి ఇంట్రెస్ట్ ఉండే కంటెంట్ చేస్తే బెటర్​ అనుకుంది. అప్పటి నుంచి ఉంగరాలు, చెవి కమ్మల వంటి స్పెషల్ ఇండియన్ జువెలరీ మేకింగ్ వీడియోలు చేసి అప్‌లోడ్ చేసింది. వాటి తయారీ ఫొటోలను కొల్లాజ్ చేసి, వీడియోలో పెడుతుంది. ప్రతి వీడియో దాదాపు 10 నుంచి 20 నిమిషాల నిడివి ఉంటుంది. వాటిలో ఒక సిరీస్​ కేవలం జువెలరీ గురించే ఉంటుంది. ఓవరాల్​గా హితల్స్ ఆర్ట్ యూట్యూబ్​ ఛానెల్​లో రెండు రకాల వీడియోలు ఎక్కువగా చూస్తున్నారు వ్యూయర్స్. అది గమనించిన హితల్, ఇయర్ రింగ్స్, నెక్లెస్​లకు వేరువేరు​గా రెండు సిరీస్​లు చేస్తుంది. ప్రతి సిరీస్​లో ఒక్కో వీడియోకి పదిలక్షలకి పైగా వ్యూస్​ వస్తుంటాయి.  

లైఫ్ హ్యాక్స్ 

ఈ ఛానెల్లో బోలెడన్ని టిప్స్​ కూడా చెప్తుంది. కిచెన్, మేకప్, క్లీనింగ్, ఫ్యాషన్​ వంటి వాటికి సంబంధించిన టిప్స్​ చాలా చెప్తుంది. చాలామంది కిచెన్​ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంటారు. ఎందుకంటే ప్రతిరోజు కిచెన్​లో పనులు చేసే వాళ్లు వాటిని కాస్త సులువుగా ఎలా చేయాలా? అని వెతుకుతారు కాబట్టి. అలాంటివాళ్లకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఈ ఛానెల్​లో చిన్న చిన్న టిప్స్​ గురించినూ వీడియోలు చేస్తుంది హితల్. ఒకే వీడియోలో 20కి పైగా టిప్స్​ అప్​లోడ్ చేస్తుంటుంది. ఆ వీడియోలకి వ్యూస్ లక్షల్లో వస్తాయి. ఒక్కోసారి వెస్టర్న్​​ వరల్డ్ గురించి వీడియోలు చేస్తుంది. వాటిలో భాగంగా యూరప్​ దేశాల్లో పాపులర్ అయిన వాల్ హ్యాంగింగ్స్‌, డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి. అలాంటివాటిలో ఒక వీడియోకి ఏకంగా 20 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 

రూమ్ మేకోవర్​ 

ఆమె అప్​లోడ్​ చేసే రూమ్ మేకోవర్​ వీడియోలకు కూడా క్రేజ్​ బాగానే ఉంది. రూమ్​ మొత్తం డెకరేట్​ చేసి పూర్తి లుక్​ మార్చేస్తుంది. యాంటిక్​ లుక్​ ఇష్టం ఉన్న వాళ్ల కోసం మేకోవర్​ టిప్స్​ చెప్తుంది. ఆ టిప్స్​ ఫాలో అయితే మళ్లీ పాతకాలం నాటి రోజుల్లోకి వెళ్లిన ఫీలింగ్​ వచ్చేస్తుంది.

నెట్​వర్త్ 

ఈ ఏడాది హితల్స్ ఆర్ట్ నెట్​ వర్త్ చూస్తే దాదాపు నాలుగు మిలియన్ల డాలర్లు ఉన్నట్టు అంచనా. ప్రతి నెలా ఆమె వీడియోలకు 16 మిలియన్లకు పైగా వ్యూస్ వస్తుంటాయి. వ్యూయర్​ షిప్ పెరిగేకొద్దీ ప్రాఫిట్స్ కూడా పెరుగుతాయి. 


హితల్ పూర్తి పేరు హితల్ వకీల్. డిజిటల్ ఏజెన్సీ మొదలుపెట్టి అందులో హై క్వాలిటీ వెబ్​ డిజైన్, డెవలప్​మెంట్​, ఇంటరాక్షన్ డిజైన్, యూజర్ ఇంటర్​ ఫేస్ డిజైన్​లు తయారుచేస్తుంది. ఎడిట్ అనే ఇనిస్టిట్యూట్ నుంచి 1996–98 మధ్య వెబ్​ డిజైనింగ్​, మల్టీమీడియాలో డిప్లొమా చేసింది హితల్. డిజిటల్ ఏజెన్సీ అయిన క్వెబ్​మేకర్​తో కలిసి పనిచేసింది. డిజిటల్ లాండ్​ స్కేప్​లో మన వాళ్లు కీ రోల్ ప్లే చేస్తారని గట్టిగా నమ్ముతుంది ఆమె. ఈ పనులే కాకుండా హితల్​కి కాలిగ్రఫీ, మెహందీ డిజైన్స్, ఇ–కార్డ్స్ ప్రిపేర్ చేయడం అన్నా చాలా ఇష్టం​.