
హైటెక్ సిటీలో… సంప్రదాయ పేర్లకు డిమాండ్ పెరుగుతోంది. వెస్ట్రన్ పేర్ల కంటే.. ట్రెడిషనల్ పేర్లకే మొగ్గుచూపుతున్నారు వ్యాపారులు. హోటలైనా…. షాపైనా.. సంప్రదాయ తెలుగు పేర్లనే పెడుతున్నారు. ఇలాంటి ట్రెడిషనల్ నేమ్స్ కు జనం ఫిదా అవుతున్నారు. సంప్రదాయ పేర్లు కస్టమర్స్ ని కూడా మస్త్ గ అట్రాక్ట్ చేస్తున్నాయి. ఏదైనా వ్యాపారం క్లిక్ అవ్వాలంటే.. మొదట పేరు క్యాచీగా ఉండాలి.. దాని తరువాతే ఏదైనా. మొన్నటి వరకూ వెస్ట్రన్ పేర్లకే ఇంట్రస్ట్ చూపించేవారు వ్యాపారులు. సిటీలో ట్రెండీ పేర్లను పెట్టేవారు. తెలుగు కంటే.. ఇంగ్లీషు పేర్లనే పెట్టి.. సిటీ పబ్లిక్ ను అట్రాక్ట్ చేసేవారు. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. వెస్ట్రన్ పేర్ల కంటే.. పక్కా సంప్రదాయ పేర్లును వెతికి మరీ పెట్టుకుంటున్నారు వ్యాపారులు.
ఏ వ్యాపారంలోనైనా జనాన్ని మొదట ఆకర్శించేది పేరే. అందుకే.. ఈ మధ్య హోటల్, రెస్టారెంట్ల పేర్లు లొట్టలేసుకునేలా పెడుతున్నారు. ఎక్కువగా సంప్రదాయ పేర్లతో ఆకట్టుకుంటున్నారు. ట్రెడిషనల్ నేమ్స్ తో పాటు.. ప్రకృతి, లేదా పండగలకు రిలేటెడ్ గా ఉన్న పేర్లను ఎంచుకుంటున్నారు. కొబ్బరిల్లు, అరిటాకు, విస్తరి, నాటుకోడి, విందు, ఉలవచారు, పందెంకోడి, సుబ్బయ్యగారి హోటల్, బాబాయ్ హోటల్, సంప్రదాయ, కోడికూర, చిట్టిగారె, వియ్యాలవారి విందు, ఆహా, సంక్రాంతి… ఇలా పేర్లతోనే నోరూరిస్తున్నారు వ్యాపారులు. హోటల్స్ కు బాగా తెలిసిన, పాపులర్ పేరును పెట్టి సగం సక్సెస్ అవుతున్నారు. పేర్లను చూసి.. ఎట్రాక్ట్ అవుతాన్నమాట నిజమే అంటున్నారు సిటీ జనం.
హోటల్స్ కు పేరు పెట్టడంలోనే కాదు.. ఇంటీరియర్ కూడా సంప్రదాయ పద్దతిలోనే డిజైన్ చేస్తున్నారు. గడ్డితో చిన్నచిన్న పూరి గుడెసెలు వేసి.. అందులో వడ్డిస్తున్నారు. డిజైన్ నుంచి వడ్డన వరకూ అంతా సంప్రదాయంగా ఉండేలా చూసుకుంటున్నారు. సంప్రదాయ పేర్లు పెట్టడంలో హోటల్స్ మొదటి ప్లేస్ లో ఉండగా.. స్కూల్స్, బట్టల షాపులు తరువాతి ప్లేస్ లో ఉన్నాయి. స్కూల్స్ విషయానికి వస్తే.. శ్రేష్టం, వశిష్ట, ఏకలవ్య, పాఠశాల, అధ్యాయణ, శ్లోక, విద్యార్థి.. వంటి తెలుగు పేర్లను పెడుతున్నారు. బట్టల షాపుల్లో రీసెంట్ గా వచ్చిన షాప్.. కృష్ణగారి బట్టల కొట్టు. కాకినాడకు చెందిన కృష్ణ అతిని పేరే షాప్ కు పెట్టారు. అంతేకాదు… నేమ్ క్యాచీగా ఉండడంతో.. కస్టమర్స్ కూడా బాగా వస్తున్నారని చెప్తున్నారు.
ఇలా తెలుగు పేర్లకు మళ్లీ డిమాండ్ రావడం సంతోషంగా ఉందంటున్నారు సిటీ పబ్లిక్. మర్చిపోతున్న సంప్రదాయ పేర్లను ఈతరం వారికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. నగరంలో సంప్రదాయ పేర్లకు డిమాండ్ పెరుగుతుండడంతో ముందే రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు వ్యాపారులు.