స్టూడెంట్లపై హెచ్ఎం లైంగిక వేధింపులు.. పోలీసులకు పేరెంట్స్ ఫిర్యాదు

స్టూడెంట్లపై హెచ్ఎం లైంగిక వేధింపులు.. పోలీసులకు పేరెంట్స్ ఫిర్యాదు

గద్వాల, వెలుగు : విద్యాబుద్ధులు నేర్పాల్సిన టీచర్.. విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. జోగుళాంబ గద్వాల జిల్లా గద్వాల మండల పరిధిలోని అనంతపురం ప్రాథమికోన్నత బడిలో మంగళవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. స్టూడెంట్, పేరెంట్స్ వివరాల మేరకు.. అనంతపురం స్కూల్ లో  బాలికలతో హెచ్ఎం వెంకటేశ్వర్లు అసభ్యకరంగా ప్రవర్తిస్తూ తాకరాని చోట తాకుతున్నాడు. బూతులు మాట్లాడుతూ పిల్లల పలకలపై అసభ్య పదాలు రాసి ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.

దీంతో బాలికలు విషయాన్ని తమ పేరెంట్స్ కు చెప్పడంతో వారు మంగళవారం స్కూల్  దగ్గరికి చేరుకున్నారు. పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా హెచ్ఎంను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం అందజేయడంతో వారు స్కూల్ కు చేరుకొని హెచ్ఎంను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై ఎంక్వైరీ చేస్తున్నామని ఎంఈఓ సురేష్  తెలిపారు. ఆ టీచర్ ను సస్పెండ్  చేయాలని పేరెంట్స్ డిమాండ్  చేశారు.