- ప్రస్తుతం హెచ్ఎండీఏ ఆధీనంలోనే ప్యాలెస్
హైదరాబాద్‌సిటీ, వెలుగు: మైత్రీ వనంలో కొనసాగుతున్న హెచ్ఎండీఏ ఆఫీసును ఆరు నెలల్లో పైగా ప్యాలెస్లోకి తరలించనున్నారు. రసూల్‌పురాలోని పైగా ప్యాలెస్2006 వరకూ హుడా ఆఫీసుగా కొనసాగింది. తర్వాత యూఎస్కాన్సులేట్కు కేటాయించారు. హుడాను హెచ్ఎండీఏగా విస్తరించిన తర్వాత కొంతకాలం తార్నాకలోని హెచ్ఎండీఏ కాంప్లెక్స్‌లో కొనసాగించారు. ఇక్కడ స్థలాభావం వల్ల అమీర్‌పేటలోని మైత్రీవనానికి ఆనుకుని ఉన్న స్వర్ణజయంతి కాంప్లెక్స్‌లోకి మార్చారు. ఇది కమర్షియల్బిల్డింగ్కావడంతో వేరే ఆఫీసులు కూడా ఉన్నాయి. అమీర్‌పేట వంటి రద్దీ ప్రాంతంలో ఉండడంతో ఈ ఆఫీసుకు చేరుకోవాలనుకునే వారికి ట్రాఫిక్ సమస్య ఇబ్బందిగా మారింది. అధికారులు, సిబ్బంది కూడా టైంకు ఆఫీసుకు చేరుకోలేకపోతున్నారు.
అలాగే, ప్రస్తుతం యూఎస్కాన్సులేట్ఆఫీసు గచ్చిబౌలికి తరలిపోవడంతో స్వర్ణజయంతి కాంప్లెక్స్‌నుంచి పైగా ప్యాలెస్‌కు హెడ్డాఫీసును షిఫ్ట్ చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. పైగా ప్యాలెస్‌ను యూఎస్కాన్సులేట్ఆఫీసుకు ఇచ్చిన తర్వాత మరింత ఆధునీకరించారు. దీంతో చిన్న చిన్న మార్పులతో ఇక్కడే కార్యకలాపాలు నిర్వహించుకునే అవకాశం ఉందంటున్నారు.
కొన్ని విభాగాలు మాత్రమే తరలింపు
ముందుగా, స్వర్ణజయంతి కాంప్లెక్స్‌లోని హెచ్ఎండీఏలోని కొన్ని కీలక విభాగాలను మాత్రమే ఈ భవనంలోకి షిఫ్ట్చేయాలని అధికారులు నిర్ణయించారు. మెట్రోపాలిటన్కమిషనర్, జాయింట్‌కమిషనర్, ప్లానింగ్విభాగాలు, ఇంజినీరింగ్వంటి ముఖ్యమైన విభాగాలే పైగా ప్యాలెస్లోకి తరలించే అవకాశం ఉంది. ఇతర విభాగాలు, కింది స్థాయి స్టాఫ్ స్వర్ణజయంతి కాంప్లెక్స్‌లోని ఆఫీసులోనే కొనసాగించే అవకాశం ఉంది. రాష్ట్రావతరణ దినోత్సవం నాటికి కార్యాలయ తరలింపు పూర్తవుతుందంటున్నారు.
హెచ్ఎండీఏ రీఆర్గనైజ్..
హెచ్ఎండీఏ పరిధి ట్రిపుల్ఆర్వరకు విస్తరించడంతో కార్యకలాపాలు కూడా విస్తరించనున్నాయి. ప్రస్తుతం ఆరు జోన్లుగా ఉండగా 10 నుంచి 12 జోన్లకు విస్తరించేందుకు ప్లాన్లు రూపొందిస్తున్నారు. ఇప్పుడున్న అధికారుల స్థానంలో అదనపు అధికారులను కూడా నియమించే అవకాశం ఉంది. అధికారుల నుంచి సిబ్బంది వరకూ వర్క్మాన్యువల్ను రూపొందించనున్నట్టు అధికారులు తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలోని అన్ని ప్రాంతాలు కవరయ్యేలా జోనల్ఆఫీసులను వేర్వేరుగా ఏర్పాటు చేయనున్నారు. ఆర్గనైజేషన్ రూపు రేఖలు ఎలా ఉండాలన్న దానిపై త్వరలోనే ఒక కన్సల్టెన్సీని నియమించి అధ్యయనం చేయించాలని నిర్ణయించారు.
జోనల్ఆఫీసులు పెరిగితే హైరైజ్డ్భవనాల నిర్మాణాల అనుమతులు, లేఔట్ పర్మిషన్లు, రెగ్యులరైజేషన్వంటివన్నీ జోనల్ఆఫీసుల ద్వారానే ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 10,060 చ.కి.మీ. విస్తీర్ణంలో ఏర్పడిన హెచ్ఎండీఏ పరిధిలో నిర్మాణాల అనుమతులు, లేఔట్ల జారీలో ఇబ్బందులు రాకుండా ఉండాలన్నదే లక్ష్యమని, అందుకే ప్రతి పనికీ హెడ్డాఫీసుకు వచ్చే పని లేకుండా జోనల్ ఆఫీసుల నుంచే అనుమతులు ఇచ్చే విషయంపై ఆలోచన చేస్తున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు.
