సింగరేణిలో హెచ్ఎంఎస్ అనుబంధ సంఘం పేరు మార్పు

సింగరేణిలో హెచ్ఎంఎస్ అనుబంధ సంఘం పేరు మార్పు
  • గౌరవ అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కవిత

కోల్ బెల్ట్, వెలుగు: సింగరేణిలో హెచ్ఎంఎస్ కు అనుబంధంగా కొనసాగిన సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ పేరును అఖిల భారత మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్‌‌గా మార్చుతున్నట్లు హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ తెలిపారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా(నస్పూర్)లో సోమవారం జరిగిన యూనియన్  మహాసభల్లో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. యూనియన్ గౌరవ అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. ఆమె రాకతో యూనియన్ బలోపేతమవుతుందన్నారు.