మాజీ హాకీ ప్లేయర్ కు వరకట్న వేధింపులు

మాజీ హాకీ ప్లేయర్ కు వరకట్న వేధింపులు

సామాన్య, మధ్యతరగతి మహిళలకే కాదు ఉన్నత స్థాయిలో ఉన్న మహిళలకు కూడా వరకట్న వేధింపులు తప్పడం లేదు. అందులోనూ ఓ హాకీ ప్లేయర్,మాజీ కెప్టెన్ కూడా ఉన్నారు. భారత ఉమెన్స్ హాకీ జట్టుకు మూడు బంగారు పతకాలు సాధించిన అర్జున అవార్డు గ్రహీత సూరజ్ లతా దేవి ఇప్పుడు వరకట్నబాధితురాలి లిస్టులో చేరింది. తనపై భర్త వరకట్న వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఈ మాజీ కెప్టెన్ గౌహతి పోలీసులను ఆశ్రయించింది.

సూరజ్ లతా దేవికి 2005లో శాంతకుమార్తో మ్యారేజ్ జరిగింది. అప్పటి నుంచి అధిక కట్నం కోసం చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తాను దక్కించుకున్న పతకాలను, వచ్చిన అవార్డును కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నాడంటూ ఫిర్యాదులో తెలిపింది. సూరజ్ లతా దేవి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

అప్పట్లో షారుఖ్ ఖాన్ హీరోగా అమ్మాయిల హాకీ కథాంశంగా వచ్చిన సినిమా చక్ దే ఇండియా ఎంతటి ఘనవిజయం సాధించింది. ఈ సినిమాకు స్ఫూర్తి కూడా సూరజ్ లతా దేవినే. ఆమె జీవితంలోని అనేక ఘట్టాల ఆధారంగానే ఈ సినిమాను నిర్మించారు.