కుర్చీలో కదలకుండా కూర్చునే బొమ్మ గీస్తాడు

కుర్చీలో కదలకుండా కూర్చునే బొమ్మ గీస్తాడు

బొమ్మ గీయడం ఒక కళ.. అందరికీ రాదు. మరి కొందరైతే రివర్స్​లో, రెండు చేతులతో, కళ్లకు గంతలు కట్టుకుని బొమ్మ గీసేవాళ్లని కూడా చూసుంటారు. కానీ, ఈయనలా బొమ్మ గీసేవాళ్లని ఇప్పటి వరకు చూసుండరు. ఎందుకంటే.. చూడ్డానికి కళ్లజోడు పెట్టుకుని, కుర్చీలో దర్జాగా కూర్చుని పెద్ద మాస్టారులా కనిపిస్తారు. ఆయన చేతికి రెండు చాక్​పీస్​ ముక్కలు ఇస్తే కుర్చీలో కదలకుండా కూర్చునే బొమ్మ గీస్తాడు. అది కూడా బోర్డును చూడకుండా వెనక్కి తిరిగి గీస్తాడు. మరొక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే.. రెండు చేతుల్లో చాక్​ పీస్​ పట్టుకుని రెండు వేర్వేరు బొమ్మలు అందంగా గీయడం. దాదాపు ఒక నిమిషం పాటు ఉన్న ఈ వీడియో సోషల్​ మీడియాలో బొమ్మను గీస్తే.. అని పాడుతూ వైరల్ అయింది.