ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్స్

ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్స్

ఎన్టీఆర్‌‌‌‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 30వ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంతో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్‌‌కు పరిచయం అవుతోంది. అతి త్వరలో షూటింగ్ స్టార్ట్ అవబోతోంది. దీంతో కాస్ట్ అండ్ క్రూని ఫైనల్ చేస్తున్నారు. సముద్ర తీరం బ్యాక్‌‌డ్రాప్‌‌లో భారీయాక్షన్ ఎపిసోడ్స్ తీయాల్సి ఉండడంతో అందుకు తగ్గట్టుగా వరల్డ్ బెస్ట్ టెక్నీషియన్స్‌‌ను ఎంపిక చేస్తున్నారు.

ఇటీవల మిషన్‌‌ ఇంపాజిబుల్‌‌, ది ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాంటి భారీ చిత్రాలకు పనిచేసిన యాక్షన్‌‌ కొరియోగ్రాఫర్‌‌ కేన్నీ బేట్స్‌‌ని తీసుకున్న టీమ్.. తాజాగా మరో హాలీవుడ్ టెక్నీషియన్‌‌ను దింపారు.  300, ఆక్వామ్యాన్‌‌, ది బ్యాట్‌‌ మ్యాన్‌‌ వంటి పలు హాలీవుడ్‌‌ సినిమాలకు పనిచేసిన వీఎఫ్‌‌ఎక్స్‌‌ టెక్నీషియన్‌‌ బ్రాడ్‌‌ మిన్నిచ్‌‌ను ఎన్టీఆర్ సినిమా కోసం తీసుకున్నారు. సినిమాలోని కీలక సన్నివేశాలకు ఆయన వీఎఫ్‌‌ఎక్స్‌‌ సూపర్‌‌వైజర్‌‌గా వర్క్ చేయనున్నారు. మొత్తానికి యాక్షన్‌‌తో పాటు వీఎఫ్‌‌ఎక్స్​కు కూడా ప్రాధాన్యత ఎక్కువేననే విషయం అర్థమవుతోంది.