- సీపీ విజయ్ కుమార్
సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రతీ ఒక్క హోం గార్డ్ సంపూర్ణ శక్తితో విధులు నిర్వహించాలని సీపీ విజయ్ కుమార్ సూచించారు. శనివారం సిద్దిపేట సిటీ సాయుధ పోలీసు ఆఫీస్ లో 63వ హోంగార్డుల రైజింగ్ డే ను నిర్వహించారు.
ఈ వేడుకులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై హోంగార్డుల గౌరవ వందనం స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ..ప్రజా భద్రత, విపత్తు నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ వంటి అనేక రంగాల్లో హోం గార్డులు పోలీస్ శాఖకు మద్దతుగా నిలుస్తూ, అంకిత భావం, క్రమశిక్షణ, నిస్వార్థ సేవలతో సమాజానికి విశేష సేవలను అందిస్తున్నారన్నారు.
అనంతరం ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, క్రైమ్ డిటెక్షన్, కమ్యూనిటీ పోలీసు విభాగంలో మెరుగైన ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, ఏఆర్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, ఆర్ఐలు కార్తీక్, ధరణి కుమార్, విష్ణు ప్రసాద్ పాల్గొన్నారు.
హోంగార్డ్ వ్యవస్థ పోలీస్ శాఖలో అంతర్భాగమే: ఎస్పీ పరితోశ్ పంకజ్
సంగారెడ్డి టౌన్: హోంగార్డ్స్ రైజింగ్ డేను పురస్కరించుకొని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో రైజింగ్ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హోంగార్డ్స్ నుంచి ఎస్పీ పరితోశ్ పంకజ్ గౌరవ వందనం స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. హోంగార్డ్ వ్యవస్థ కూడా పోలీస్‌శాఖలో అంతర్భాగమే అన్నారు. వారి ఆరోగ్య పరిరక్షణ కోసం బ్యాంకుల సహకారంతో రూ. 33 లక్షల హెల్త్ కవరేజ్ అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మరణించిన 23 మంది హోం గార్డ్ కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా మంజూరు చేస్తామన్నారు.
పోలీస్ ప్యాకేజీలో భాగంగా యాక్సిడెంట్ కేసుకు రూ. 30 లక్షలు ఇద్దరు పిల్లల చదువు కోసం ఒక్కొక్కరికి రూ. 2000 ఆర్థిక ప్రయోజనం కల్పిస్తామన్నారు. త్వరలోనే కొత్త హోంగార్డ్స్ నియామకాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ఎస్పీ రఘునందన్ రావు, అధికారులు నరేందర్, రామారావు, డేనియల్, రాజశేఖర్ రెడ్డి, రాము నాయుడు, రమేష్ ఉన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డ్స్పాత్ర కీలకం
మెదక్ టౌన్ : హోంగార్డ్స్వ్యవస్థ శాంతి భద్రతల పరిరక్షణలో విశిష్ట సేవలందిస్తోందని ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు అన్నారు. జిల్లా పోలీస్పరేడ్గ్రౌండ్స్లో నిర్వహించిన హోంగార్డ్స్ రైజింగ్‌డే పరేడ్‌లో ఎస్పీ పాల్గొని గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ..మెదక్ జిల్లాలో ప్రస్తుతం 142 మంది హోం గార్డ్స్ సిబ్బంది వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారన్నారు.
ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతలు, కమ్యూనిటీ పోలీసింగ్, పండుగల బందోబస్తు, ఎన్నికల సమయంలో హోం గార్డ్స్ పాత్ర కీలకమన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హోం గార్డ్స్ సిబ్బందికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. డ్యూటీ అలవెన్సు రూ.921 నుంచి వెయ్యి రూపాయలకు పెంచినట్లు చెప్పారు. ట్రాఫిక్‌లో పనిచేసే సిబ్బందికి అదనంగా 30 శాతం అలవెన్స్అందుతుందన్నారు. పరేడ్ అలవెన్స్‌ను రూ.100 నుంచి రూ.200కు పెంచినట్లు చెప్పారు.
విధి నిర్వహణలో మరణించిన శివరాం, మహేందర్ కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున సాయం అందించినట్లు పేర్కొన్నారు. క్రీడా పోటీల్లో విజేతలైన సిబ్బందికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్‌గౌడ్, సుభాష్ చంద్రబోస్, రంగానాయక్, సీఐలు మహేశ్, జార్జ్, రాజశేఖర్ రెడ్డి, సందీప్ రెడ్డి, కృష్ణ మూర్తి, శైలేందర్, రామకృష్ణ, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
