హోం ఐసోలేషన్ పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

హోం ఐసోలేషన్ పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

ఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం మార్గదర్శకాలు సవరించింది. లక్షణాలు కనిపించని, స్వల్ప లక్షణాలు కలిగిన బాధితుల హోం ఐసోలేషన్ నిబంధనల్లో మార్పు చేసింది. గతంలో 10 రోజులుగా ఉన్న హోం ఐసోలేషన్ ను ప్రస్తుతం వారం రోజులకు కుదించింది. లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు కలిగిన కరోనా బాధితులకు వరుసగా మూడు రోజులు జ్వరం లేనిపక్షంలో 7రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉంటే సరిపోతుందని స్పష్టం చేసింది. ఐసోలేషన్ ముగిసిన అనంతరం కరోనా టెస్టు చేయించుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

కేంద్రం సవరించిన మార్గదర్శకాల ప్రకారం

  • లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు కలిగిన కరోనా బాధితులు గాలి, వెలుతురు ఎక్కువగా ఉండే ప్రత్యేక గదిలో ఐసోలేషన్ లో ఉండాలి. 
  • మూడు లేయర్లు కలిగిన మాస్కును ధరించాలి. ప్రతి 8గంటలకు ఒకసారి మాస్కును మార్చుకోవాలి.
  • బాధితులు వీలైనంత ఎక్కువగా ద్రవ పదార్థాలు, విశ్రాంతి తీసుకోవాలి.
  • జ్వరం ఉంటే డాక్టర్ల సూచన మేరకు పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకోవాలి.
  • ఆక్సిజన్ లెవెల్స్ ను తరుచూ చెక్ చేసుకుంటూ ఉండాలి.
  • అవసరమైతే టెలి కన్సల్టేషన్ ద్వారా డాక్టర్లను సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలి. 

 

For more news..

ఢిల్లీలో థర్డ్ వేవ్ వచ్చేసింది

బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై కేంద్రానికి నివేదిక