ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

హోం శాఖ మంత్రి మహమూద్ అలీ

కల్వకుర్తి, వెలుగు: సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీఎం అయ్యాక దేశాన్ని అభివృద్ధి చేస్తారని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ చెప్పారు. శనివారం కల్వకుర్తి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌‌‌‌‌‌‌‌లో సియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీ అంబులెన్స్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. రైతుబంధు, రైతు బీమా, దళితబంధు పథకాలు దేశంలో ఎక్కడా లేవని గుర్తుచేశారు. ఇచ్చిన మాట ప్రకారం 57 ఏళ్లు నిండిన అర్హులకు పింఛన్లు పంపిణీ చేస్తున్నారన్నారు. అనంతరం ముస్తాఫా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌‌‌‌‌‌‌‌ను అందజేసిన డాక్టర్ హకీమ్ సయ్యద్ అంజాద్‌‌‌‌‌‌‌‌ను అభినందించారు.  అనంతరం అంజాద్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ సకాలంలో అంబులెన్స్ రాక తన కొడుకును కోల్పోయానని, అందుకే తమ సంస్థ తరఫున  ప్రజలకు ఫ్రీ అంబులెన్సులు అందిస్తున్నామని చెప్పారు. ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, మైనార్టీ కమిషన్ చైర్మన్ ఇంతియాజ్ అహ్మద్, జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, జడ్పీటీసీ భరత్ ప్రసాద్, మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యం, నేతలు మక్బూల్, గోలి శ్రీనివాస్ రెడ్డి, ఆనంద్ కుమార్, సూర్య ప్రకాశ్ పాల్గొన్నారు. 

బాధిత ప్యామిలీలకు రూ.2 లక్షల ఎక్స్‌‌‌‌‌‌‌‌గ్రేషియా

జడ్చర్ల, వెలుగు: ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌పై కంటైనర్ ట్రాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఢీకొట్టిన ఘటనలో చనిపోయిన ఆలూరుకు చెందిన  బాధిత కుంటుంబాలకు ప్రభుత్వం రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌‌‌‌‌‌‌‌గ్రేషియా ప్రకటించింది.  శనివారం మహబూబ్​నగర్​ జడ్పీ వైస్ చైర్మన్ ​కోడ్గల్​యాదయ్య, తహసీల్దార్​ లక్ష్మీనారాయణ  మృతుడు ట్రాక్టర్​ డ్రైవర్​ విష్ణు భార్య  లక్ష్మీనర్సమ్మకు  చెక్కును అందించారు. మిగతా ఇద్దరి కుటుంబాలకు కూడా రూ. 2 లక్షల చొప్పును చెక్కులు ఇచ్చామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌‌‌‌‌‌‌‌ సుకన్య, రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రణీల్ చందర్​ ఉన్నారు. 

చిరుత కాదు..హైనా పాదముద్రలు

పెబ్బేరు, వెలుగు: పెబ్బేరు మండలం తిప్పాయిపల్లి, గుమ్మడం పరిధిలో చిరుత కలకలం రేగింది. వివరాల్లోకి వెళ్తే.. తిప్పాయిపల్లికి చెందిన రైతు మజ్జరి రాముడు గ్రామ శివారులో శనివారం ఉదయం చిరుత కనిపించిందని, పాదముద్రలు కూడా ఉన్నాయని చుట్టు పక్కల రైతులకు చెప్పాడు. దీంతో  తిప్పాయిపల్లితో పాటు పక్కనే ఉన్న గుమ్మడం గ్రామ రైతులు కూడా పొలాల వైపు వెళ్లలేదు. జిల్లా ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా.. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మహేందర్, సెక్షన్ ఆఫీసర్ ప్రశాంత్ రెడ్డి, శ్రీను సంఘటన స్థలానికి చేరుకొని పాదముద్రలను పరిశీలించారు. ఇవి చిరుత పాదముద్రలు కావని హైనావని తేల్చారు.  

పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ఐని ఎప్పుడు పూర్తి చేస్తరు?
టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లురవి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను మూడేళ్లలో పూర్తి చేస్తామన్న సర్కారు గడువు దాటినా 30 శాతం పనులు కూడా చేయలేదని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లురవి మండిపడ్డారు. ఇందుకు బాధ్యత వహిస్తూ ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పాలమూరు పునర్ నిర్మాణ ఫోరం, కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి శనివారం జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపం వద్ద చేపట్టిన 36 గంటల నిరాహార దీక్షకు మద్దతు తెలిపారు. అనంతరం మల్లురవి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఉత్తర తెలంగాణ ప్రాజెక్టులపై ఉన్న శ్రద్ధ దక్షిణ తెలంగాణపై లేదని విమర్శించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కాకుంటే పాలమూరు ఏడారిగా మారే ప్రమాదం ఉందన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉంటే సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఒత్తిడి తీసుకువచ్చి పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎల్‌‌‌‌‌‌‌‌ఐని పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పేట డీసీసీ ప్రెసిడెంట్లు ఉబేదుల్లా కోత్వాల్, ప్రెసిడెంట్ శ్రీహరి, టీపీసీసీ సెక్రటరీలు సంపత్ కుమార్, ప్రదీప్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, నేతలు సత్తూరు చంద్రకుమార్ గౌడ్, బెక్కరి అనిత, మీడియా సెల్ కన్వీనర్ సేజే బెనహర్, లక్ష్మణ్ యాదవ్, సాయిబాబ పాల్గొన్నారు. 

పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు

లింగాల, వెలుగు : భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్‌‌‌‌‌‌‌‌ అయ్యాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు కురిసిన వర్షానికి  లింగాల మండలం నుంచి చెన్నంపల్లికి వెళ్లే దారిలో బ్రిడ్జిపై నుంచి వరద పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి. చెన్నంపల్లి నుంచి పద్మనపల్లి గ్రామానికి వెళ్లే దారి, లింగాల నుంచి అప్పాయిపల్లికి వెళ్లే రోడ్డులోనూ ఇదే పరిస్థితి.  అప్పాయిపల్లిలో వరద ఉధృతికి  మొళ్ల జంగయ్యకు చెందిన ఎద్దు కొట్టుకుపోయింది.  ఎప్పటిలాగే శుక్రవారం తన పొలంలో కాడెడ్లను కట్టేసి ఇంటికి వెళ్లిన రైతు పొద్దున వచ్చి చూసే సరికి ఒక ఎద్దు కనిపించలేదు.  పక్కనే ఉన్న వాగు పొంగడంతో కొట్టుకుపోయింది.  కొద్ది దూరంలో చనిపోయి కనిపించడంతో రైతు లబోదిబోమన్నాడు. 

రాష్ట్ర స్కీములు దేశానికి ఆదర్శం
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

మదనాపురం, వెలుగు: తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని  ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. మదనాపురం మండలం నరసింగాపురం గ్రామానికి ఆర్టీసీ బస్ సర్వీస్‌‌‌‌ను ప్రారంభించారు. అనంతరం దుప్పల్లి, కొత్తపల్లి, నర్సింగపురం, కొన్నుర్ పెద్ద తండా గ్రామాల్లోని అర్హులకు పింఛన్‌‌‌‌‌‌‌‌ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారని చెప్పారు. అర్హులందరికీ పింఛన్లు ఇస్తామని, మిస్సైన వాళ్లు ఆందోళన చెందవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జున్ను పద్మావతి వెంకట్, జడ్పీటీసీ కృష్ణయ్య యాదవ్, మార్కెట్ చైర్మన్ శ్రవణ్ కుమార్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ వి ఎస్ రాజు, సర్పంచులు బక్షి భాగ్యమ్మ, శివకుమార్, అరుణ, అంబ్రనాయక్, కురుమూర్తి, రామనారాయణ పాల్గొన్నారు.

బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్రు
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

వనపర్తి టౌన్, వెలుగు: పోలీస్ రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని పలువురు వక్తలు ఆరోపించారు. శనివారం జిల్లా కేంద్రంలోని యాదవ సంఘం భవనంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగం బద్ధంగా ఇచ్చిన రిజర్వేషన్లను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ ఉల్లఘిస్తున్నారని మండిపడ్డారు. పోలీస్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు సవరించేందుకు వెంటనే సబ్ నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. కోచింగ్ సెంటర్ల పేరుతో విద్యార్థులను దోపిడీ చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో నేతలు రాధా కృష్ణ, రాజారాం ప్రకాశ్, గంధం నాగరాజు, శివ నాయక్, రాజనగరం రాజేశ్, గోవిందు, గణేశ్, చెన్న కేశవులు, చిరంజీవి, మెంటపల్లీ రాములు పాల్గొన్నారు.

బస్సును ఢీకొట్టిన బైక్.. ఇద్దరి మృతి
దైవ దర్శనానికి వెళ్తుండగా ప్రమాదం

గద్వాల, వెలుగు: ఆర్టీసీ బస్సును బైక్‌‌‌‌‌‌‌‌ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సీఐలు చంద్రశేఖర్, సూర్య నాయక్, ఎస్సై గోకారి వివరాల ప్రకారం.. అయిజ మండలం గుడిదొడ్డికి చెందిన మహేశ్వర్ రెడ్డి(26) గద్వాల నివాస ముంటూ ఓ రెస్టారెంట్‌‌‌‌‌‌‌‌లో పనిచేస్తున్నాడు. అయిజ టౌన్‌‌‌‌‌‌‌‌లోని టీచర్స్ కాలనీకి చెందిన చంద్రకళ(26), తనగల గ్రామానికి చెందిన మంజుల ఓ ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌లో నర్సులుగా పనిచేస్తున్నారు. శనివారం పౌర్ణమి కావడంతో బీచుపల్లి ఆంజనేయస్వామి దర్శించుకునేందుకు గద్వాల నుంచి బైక్‌‌‌‌‌‌‌‌పై  బయల్దేరారు.  ఇటిక్యాల మండలం ఎర్రవల్లి చౌరస్తాలోని గోశాల దగ్గర ముందు వెళ్తున్న డీసీఎంను ఓవ‌‌‌‌‌‌‌‌ర్ టేక్ చేయ‌‌‌‌‌‌‌‌బోయి వనపర్తి నుంచి గద్వాలకు వస్తున్న ఆర్టీసీ బస్సును  ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మహేశ్వర్ రెడ్డి, చంద్రకళ అక్కడికక్కడే చనిపోగా.. మంజులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంజులను కర్నూల్ ఆసుపత్రికి, మృతదేహాలను పోస్టమార్టం కోసం గద్వాల ఆస్పత్రికి తరలించారు.  ఇందులో చంద్రకళకు భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు.  మహేశ్వర్ రెడ్డి, గాయపడిన మంజులకు ఇంకా పెళ్లి కాలేదు.  బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

సెల్‌‌‌‌‌‌‌‌పోన్ల దొంగ అరెస్ట్

గోపాల్ పేట, వెలుగు: గణేశ్ మండపం వద్ద నాలుగు సెల్‌‌‌‌‌‌‌‌పోన్లను చోరీ చేసిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై నవీద్ వివరాల ప్రకారం.. ఆగస్టు 31న గోపాల్ పేట మండల కేంద్రంలోని బస్టాండ్ దగ్గర  ఏర్పాటు చేసిన గణేశ్‌‌‌‌‌‌‌‌ మండపం వద్ద నాలుగు ఫోన్లు పోయినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు పీఎస్‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు టెక్నాలజీ సాయంతో దర్యాప్తు చేపట్టి లింగాల మండలానికి చెందిన బోరోజు సాయి కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిందితుడిగా గుర్తించారు. శనివారం అతన్ని అరెస్టు చేసి పోన్లు రికవరీ చేశారు. అనంతరం నిందితుడిని వనపర్తి కోర్టులో హాజరు పరిచారు.