ఇళ్ల అమ్మకాలు పెరుగుతున్నాయ్​

ఇళ్ల అమ్మకాలు పెరుగుతున్నాయ్​

ప్రీ కరోనా స్థాయిలో 65 శాతానికి..
ప్రాపర్టీ కన్సల్టెంట్  అనరాక్ రిపోర్ట్
ఫెస్టివ్ సీజన్‌‌‌‌పై డెవలపర్లు ఆశలు
బయ్యర్లకు డిస్కౌంట్లు

న్యూఢిల్లీ: రెసిడెన్షియల్ సెక్టార్ సేల్స్ కరోనా ముందటి స్థాయిల్లో 65 శాతానికి చేరుకున్నట్టు ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. అమ్మకాలు పెంచుకునేందుకు లాంచింగ్ క్యాంపెయిన్ ఆఫర్లు, డిస్కౌంట్లపై డెవలపర్లు ఫోకస్ చేసినట్టు అనరాక్ చెప్పింది. 2020 క్యూ3(జూలై–సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌)లో ఇండియాలో టాప్ 7 సిటీల్లో 29,520 యూనిట్ల రెసిడెన్షియల్ ప్రాపర్టీలు అమ్ముడుపోయాయి. గతేడాదితో చూసుకుంటే మాత్రం హౌసింగ్ సేల్స్ 46 శాతం తగ్గిపోయాయి. కానీ 2020 క్యూ1తో పోలిస్తే మాత్రం ఈ అమ్మకాలు అప్పటి సేల్స్‌‌‌‌లో 65 శాతానికి చేరుకున్నాయి. ఈ మూడో క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో ఢిల్లీ–ఎన్‌‌‌‌సీఆర్, ఎంఎంఆర్(ముంబై మెట్రోపాలిటన్ రీజన్), బెంగళూరు, పుణేలలోనే 84 శాతం అమ్మకాలు నమోదయ్యాయి. కొత్త లాంచ్‌‌‌‌లు కూడా టాప్ 7 సిటీల్లో 32,530కి పడిపోయాయి. ఇవి కరోనా ముందు క్వార్టర్ క్యూ1లో 41,220గా ఉన్నాయి. కరోనాతో డిమాండ్ స్తబ్దుగా ఉన్నట్టు అనరాక్ చెప్పింది.

ఈ ఏడాది ప్రారంభం(జనవరి) నుంచి సెప్టెంబర్ వరకు సేల్స్ 57 శాతం తగ్గి 87,460 యూనిట్లుగా ఉన్నట్టు అనరాక్ రిపోర్ట్‌‌‌‌ తెలిపింది. గతేడాది ఇదే కాలంలో 2,02,200 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి.  స్టాంప్ డ్యూటీ ఛార్జీలు తగ్గించడం(మహారాష్ట్రలో), హోమ్ బయ్యర్లను ఆకట్టుకోవడానికి డిస్కౌంట్లు, ఉచితాలను ఇవ్వడం వంటి వాటిని డెవలపర్లు అమలు చేస్తున్నారు. ఇవన్నీ  రాబోతున్న ఫెస్టివ్ సీజన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌కు పాజిటివ్ సంకేతంగా నిలుస్తున్నాయి. కరోనా ముందటి స్థాయిలకు సేల్స్ చేరుకుంటున్నాయి. ఫెస్టివ్ సీజన్‌‌‌‌లో కచ్చితంగా హౌసింగ్ సేల్స్ రికవరీ అవుతాయని భావిస్తున్నామని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ ఛైర్మన్ అంజు పురి చెప్పారు.

ఆశ్చర్యకరంగా హైదరాబాద్, కోల్‌‌‌‌కతా, ఎన్‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌లో కొత్త సప్లయిలు పెరిగాయి. ఈ మూడో క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌లో కొత్త సప్లయి 45 శాతం, కోల్‌‌‌‌కతాలో 24 శాతం, ఎన్‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌లో 10 శాతం పెరిగాయి. అఫర్డబుల్, మిడ్ సెగ్మెంట్లు(రూ.80 లక్షల వరకు) మొత్తం కొత్త సప్లయిలో 72 శాతానికి పైగా షేరును సంపాదించుకున్నాయి.