హోండా నుండి దేశంలోనే ఫస్ట్ హైబ్రిడ్ SUV.. దీని మైలేజ్, సేఫ్టీ ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్ అంతే !

హోండా నుండి దేశంలోనే ఫస్ట్ హైబ్రిడ్ SUV.. దీని మైలేజ్, సేఫ్టీ ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్ అంతే !

ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా  లేటెస్ట్  ZR-V హైబ్రిడ్ SUVని ఇండియాలో  ఆవిష్కరించింది. ఈ కారు రాబోయే కొద్ది వారాల్లో మార్కెట్లోకి రానుంది. దీని బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభం కాగా... జూలై 2026 రెండో వారం నుండి కారు డెలివరీలు మొదలవుతాయి. ప్రత్యేకత ఏంటంటే  హోండా కంపెనీ నుండి భారత్‌లో విడుదలవుతున్న మొదటి హైబ్రిడ్ SUV  కారు ఇదే. ప్రస్తుతం ఉన్న 'ఎలివేట్' కారు కంటే ఇది చాలా ప్రీమియం మోడల్.

ఈ కారును జపాన్ నుండి ఇండియాకి దిగుమతి చేయనున్నారు. వైట్, గ్రే, బ్లక్ సహా మొత్తంగా నాలుగు కలర్స్ లో  లభిస్తుంది. హోండా కంపెనీ కార్లలో సైజ్  పరంగా ఇదే అతిపెద్ద కారు. దీని పొడవు 4,657mm, వెడల్పు 1,840 mm, ఎత్తు 1,621 mm, వీల్‌బేస్ 2,655mm. దీనికి 18-ఇంచుల స్టైలిష్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. సైజ్ పరంగా చూస్తే ఇది స్కోడా కోడియాక్, వోక్స్‌వ్యాగన్ టైగన్, హ్యుందాయ్ టక్సన్ వంటి కార్లకు సమానంగా ఉంటుంది.

ఇంజిన్ అండ్  మైలేజ్ 
 ఇందులో 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఒక ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంటుంది. ఇవి రెండూ కలిసి 181 bhp పవర్, 315 Nm టార్క్‌ను అందిస్తాయి. కేవలం 7.9 సెకన్లలోనే 0 నుండి 100 కి.మీ స్పీడ్ అందుకోగలదు. దీని టాప్ స్పీడ్ గంటకు 173 కి.మీ. హైబ్రిడ్ టెక్నాలజీ వల్ల లీటరుకు 22.80 కి.మీ మైలేజ్ ఇస్తుంది. భారతదేశంలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కార్లలో ఇది ఒకటి.

 ఇంటీరియర్& ఫీచర్లు
కారు లోపల అంతా  బ్లాక్ థీమ్ ఇంటీరియర్‌తో, మెటల్ టచ్, మెత్తటి ప్రీమియం మెటీరియల్స్‌తో డ్యాష్‌బోర్డ్ చాలా అందంగా ఉంటుంది. డ్యాష్‌బోర్డ్‌పై 9.0-ఇంచుల టచ్‌స్క్రీన్ ఉంటుంది. పాటల కోసం 12 స్పీకర్ల బోస్ (Bose) సౌండ్ సిస్టమ్ అమర్చారు. ఇతర ఫీచర్లలో డ్రైవర్ కోసం 10-ఇంచుల డిజిటల్ మీటర్ స్క్రీన్, రెండు వైపులా వేర్వేరుగా ఏసీ సెట్ చేసుకునే డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్,  మెమరీ ఫంక్షన్ ఉన్న పవర్డ్ సీట్లు ఉన్నాయి. అయితే గేర్లు మార్చడానికి లివర్ కాకుండా బటన్లు ఇచ్చారు.

సేఫ్టీ ఫీచర్లు 
ఈ కారులో ప్రయాణికుల రక్షణ కోసం మోకాళ్ల ఎయిర్‌బ్యాగ్‌తో కలిపి మొత్తం 8 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి.  అడ్వాన్స్డ్ సేఫ్టీ (ADAS)లో ఆటోమేటిక్ బ్రేకులు, లైన్ దాటకుండా కారును కంట్రోల్ చేయడం, ముందు వాహనాన్ని బట్టి స్పీడ్  మార్చుకునే అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, డ్రైవర్ అలసటను కనిపెట్టే సిస్టమ్ ఇందులో ఉన్నాయి. ఇతర బ్రేకింగ్ ఫీచర్లు చూస్తే నాలుగు   డిస్క్ బ్రేకులు, కొండలపై కారు వెనక్కి జారకుండా ఆపే హిల్ హోల్డ్ అసిస్ట్, తక్కువ స్పీడుతో ఎలక్ట్రిక్ మోడ్‌లో వెళ్లేటప్పుడు హెచ్చరించే సౌండ్ సిస్టమ్ (AVAS) ఉన్నాయి.

 ధర ఎంతంటే 
వచ్చే జూన్ నెలలో హోండా సంస్థ ఈ కార్ ధరలను అధికారికంగా ప్రకటిస్తుంది. విదేశాల నుండి డైరెక్ట్ దిగుమతి అవుతున్నందున, దీని ధర కొంచెం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. కానీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 45 లక్షల పైనే ఉండే అవకాశం ఉంది.