హాంకాంగ్ పై చైనా తీరు వినాశకరం

హాంకాంగ్ పై చైనా తీరు వినాశకరం

మాజీ బ్రిటీష్ కాలనీ స్వయం ప్రతిపత్తి, స్వేచ్ఛను హరించడమే
యూఎస్ విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో ఘాటు విమర్శలు
న్యూఢిల్లీ: హాంకాంగ్ పై నియంత్రణను కఠినతరం చేయాలన్న చైనా ప్రకటనను ఏకపక్ష, వినాశకరమైనదిగా యూఎస్ విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో ఘాటుగా విమర్శించారు. మాజీ బ్రిటిష్ కాలనీ అయిన హాంకాంగ్ ఇకపై స్వయం ప్రతిపత్తిగా పరిగణించబడదని ఆయన పేర్కొన్నారు. హాంకాంగ్ పై తన ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి గత శుక్రవారం నేషనల్ సెక్యూరిటీ చట్టాలకు సంబంధించిన ఓ డ్రాఫ్ట్ ను డ్రాగన్ కంట్రీ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది. దీని ద్వారా ఫార్మర్ బ్రిటిష్ కాలనీపై తన కంట్రోల్ ను మరింత పెంచుకోవాలని బీజింగ్ ప్రయత్నిస్తోంది. ఇది హాంకాంగ్ స్వయం ప్రతిపత్తి, అక్కడి పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

ఎకనామిక్ పవర్ హౌస్ గా పిలిచే హాంకాంగ్.. స్పెషల్ అడ్మినిస్ట్రేషన్ రీజియన్ (ఎస్ఏఆర్) ఆఫ్ చైనాలో ఓ భాగంగా ఉంది. 1997 వ సంవత్సరం జూలై 1 నుంచి చైనా ఏలుబడిలోకి హాంకాంగ్ వెళ్లింది. అప్పట్నుంచి చైనాలో ‘ఒకే దేశం, రెండు విధానాలు’ అమలులో ఉంది. దీని ద్వారా హాంకాంగ్ లో ఉన్న స్వేచ్ఛ చైనాలోని ఇతర ప్రాంతాల్లో లేదు. హాంకాంగ్ పై చైనా రుద్దుతున్న కొత్త చట్టాలపై అగ్రరాజ్యం అమెరికా గత కొన్ని రోజులుగా తన అభిప్రాయాలు చెబుతూ వస్తోంది. చైనాకు వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని.. డ్రాగన్ కంట్రీపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తూ వస్తోంది. దీనికి సంబంధించి తాజాగా యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో స్పందించారు.

‘క్షేత్రస్థాయి వాస్తవాలను బట్టి చైనా నుంచి హాంకాంగ్ ఎక్కువ స్థాయి స్వయం ప్రతిపత్తిని కలిగి ఉందని భూమి పై ఏ సహేతుకమైన వ్యక్తి కూడా చెప్పలేరు. గత వారం పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (పీఆర్ సీ) నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఏకపక్షంగా హాంకాంగ్ పై నేషనల్ సెక్యూరిటీ చట్టాలను రుద్దింది. బీజింగ్ తీసుకున్న ఈ వినాశకరమైన నిర్ణయం హాంకాంగ్ స్వయం ప్రతిపత్తిని, స్వేచ్ఛను ప్రాథమికంగా అణగదొక్కేదే. అలాగే సినో–బ్రిటీష్ జాయింట్ డైరెక్షన్ తోపాటు యూఎన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ట్రీటీ కింద హాంకాంగ్ ప్రజల స్వేచ్ఛకు ప్రామిస్ చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే రియాలిటీని గుర్తించాలి. స్వేచ్ఛాయుత హాంకాంగ్ అధికార చైనాకు ఓ నమూనాను అందిస్తుందని యునైటెడ్ స్టేట్స్ ఒకప్పుడు ఆశించింది. కానీ, హాంకాంగ్ ను చైనా మోడలింగ్ చేస్తోందని ఇప్పుడు అర్థమవుతోంది. హాంకాంగ్ ప్రజల పక్షాన యూఎస్ నిలబడుతుంది. పోరాడుతున్న వారి తరఫున మేం నిలుస్తాం’ అని పాంపియో స్పష్టం చేశారు.