
ఆర్మూర్, వెలుగు: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతును ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం సన్మానించారు. ఆర్మూర్ మండల ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఇటీవల ఎన్నుకున్నారు. అసోసియేషన్అధ్యక్షుడు భరత్ చంద్ర మల్లయ్య, కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్ ఆధ్వర్యంలో కొత్తగా ఎన్నికయిన కార్యవర్గం నిజామాబాద్లో కలెక్టర్ను కలిశారు. అసోసియేషన్ జిల్లా బాధ్యులు కాంతి గంగారెడ్డి, విద్యా గోపీకృష్ణ, స్కాలర్స్ వేణు, శాంభవి మధుసూధన్ తదితరులు పాల్గొన్నారు.