కాంగ్రెస్​లో చేరిన మున్సిపల్​ కౌన్సిలర్లకు సన్మానం 

కాంగ్రెస్​లో చేరిన మున్సిపల్​ కౌన్సిలర్లకు సన్మానం 

కోల్​బెల్ట్​, వెలుగు :  చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి కృషితో  క్యాతనపల్లి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తామని మున్సిపల్​ చైర్​ పర్సన్​ జంగం కళ, వైస్​ చైర్మన్​ సాగర్​రెడ్డి, కాంగ్రెస్​ కౌన్సిలర్లు తెలిపారు. గురువారం రామకృష్ణాపూర్​ కాంగ్రెస్​  ఆఫీస్​లో జరిగిన కార్యక్రమంలో ఇటీవల బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్​ చేరి, అవిశ్వాస తీర్మానంలో విజయం సాధించిన లీడర్లకు సన్మానం చేశారు. 

ఈ కార్యక్రమంలో టౌన్​ ప్రెసిడెంట్ పల్లె రాజు,  కౌన్సిలర్లు పోలం సత్యనారాయణ, పనాస రాజయ్య, కొక్కుల స్రవంతి, పుల్లురి సుధాకర్, మేకల తిరుమల, కాంగ్రెస్​ కౌన్సిలర్లు బింగీ శివాని,ఎర్రబెల్లి ప్రేమలత,  కాంగ్రెస్​ లీడర్లు రాఘునాథ్​రెడ్డి, ఓడ్నాల శ్రీనివాస్​, పల్లె రాజు, గోపతి రాజయ్య, అబ్దుల్​ అజీజ్​, మహంకాళీ శ్రీనివాస్​, యాకుబ్​అలీ,నీలం శ్రీనివాస్​గౌడ్​, బత్తుల వేణు, సంగ బుచ్చయ్య పాల్గొన్నారు.