
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనా దూకుడు పెంచడానికి ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయడమే కారణమని జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఆర్టికల్ 370 రద్దును చైనా ఎన్నటికీ అంగీకరించదని, డ్రాగన్ మద్దతుతో ఆర్టికల్ 370 పునరుద్ధరణ జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఎల్‌ఏసీ వద్ద చైనా ఏం చేస్తోందో దానికి ఆర్టికల్ 370ని రద్దు చేయడమే కారణం. చైనా సాయంతో ఆర్టికల్ 370ని జమ్మూ కాశ్మీర్‌లో తిరిగి పునరుద్ధరిస్తారని ఆశిస్తున్నా. మేం చైనా ప్రెసిడెంట్‌ను ఆహ్వానించలేదు. ఆయనను ప్రధాని మోడీనే ఇన్వైట్ చేశారు. చెన్నైలో వారిద్దరూ కలసి భోజనం కూడా చేశారు’ అని ఫరూక్ అబ్దుల్లా చెప్పారు.