వార ఫలాలు : 2023 మే 28 - నుంచి జూన్‌ 3 వరకు

వార ఫలాలు  : 2023 మే 28 - నుంచి జూన్‌ 3 వరకు

మేషం

కొత్త వ్యక్తులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. విద్యార్థులు ఆశించిన అవకాశాలు దక్కించుకుంటారు. అధికాదాయం ఉత్సాహాన్నిస్తుంది. శారీరక రుగ్మతలు బాధిస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశపరుస్తాయి. వ్యాపారులు పెట్టుబడులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులకు సమస్యల నుంచి విముక్తి.

వృషభం

ముఖ్యమైన కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆస్తి వివాదాలు నెలకొన్నా కొంత మేరకు పరిష్కారం అవుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. శత్రువులు సైతం స్నేహితులుగా మారతారు. ఇంటి నిర్మాణాలకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు. కళాకారులకు అప్రయత్న కార్యసిద్ధి. 

మిథునం

ప్రారంభంలో కొద్దిపాటి ఒడిదుడుకులు, సమస్యలు ఎదురైనా సర్దుబాటు కాగలవు. ఆదాయానికి లోటు ఉండదు. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కరించుకుంటారు. చేపట్టిన కార్యాలు సజావుగానే సాగుతాయి. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల యత్నాలు సఫలీకృతమవుతాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు. కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. 

కర్కాటకం

విద్యార్థులు కోరుకున్న అవకాశాలు అందుకుంటారు. ఉద్యోగాన్వేషణలో విజయం సాధిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్య కార్యాలు సజావుగా పూర్తి కాగలవు. వ్యాపారులకు కొత్త భాగస్వాములు లభిస్తారు. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. వారారంభంలో ఖర్చులు. బంధువులతో వివాదాలు.

సింహం

సానుకూల పవనాల మధ్య ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. కొన్ని కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ధనలబ్ధి. గౌరవం పెరుగుతుంది. పరిచయాలు మరింత పెరుగుతాయి. శత్రువులు కూడా అనుకూలంగా మారతారు. వ్యాపారులు పురోగతి సాధిస్తారు. ఉద్యోగులు సమస్యల నుంచి బయటపడతారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు శ్రమానంతరం ఫలితం ఉంటుంది.

కన్య

చేపట్టిన కార్యాలు పూర్తి చేస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. అప్పులు తీరుస్తారు. దూరమైన బంధువులు దగ్గరవుతారు. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి. కుటుంబసమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులు సత్తా చాటుకుంటారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అవకాశాలు విస్తృతమవుతాయి.. వారాంతంలో ఖర్చులు.

తుల

ఖర్చులు పెరిగి అప్పులు చేస్తారు. ఆలోచనలు నిలకడగా సాగవు. అనుకున్న కార్యక్రమాలలో ఆటంకాలు. బంధువర్గంతో తగాదాలు. స్థిరాస్తి విషయంలో చికాకులు. శారీరక రుగ్మతలు బాధిస్తాయి. సోదరుల నుంచి ఒత్తిళ్లు. వ్యాపారులకు ఆటుపోట్లు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. కళాకారులు, సాంకేతిక నిపుణులకు సమస్యలు. వారం మధ్యలో శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం.

వృశ్చికం

రాబడి కొంతమేర అనుకూలిస్తుంది. చేపట్టిన కార్యాలలో అవరోధాలు తొలగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్థిరాస్తిపై అగ్రిమెంట్లు చేసుకుంటారు. తండ్రి తరఫు నుంచి ధనలాభ సూచనలు. వ్యాపారులకు భాగస్వాముల నుంచి లాభం. ఉద్యోగులు విధుల్లో ఆటంకాలు అధిగమిస్తారు. కళాకారులు, సాంకేతిక నిపుణులు అనుకున్నది సాధిస్తారు. వారారంభంలో వృథా ఖర్చులు. 

ధనుస్సు

కొత్త కార్యక్రమాల్లో విజయం. ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం అందుతుంది. బంధువులతో విభేదాలను పరిష్కరించుకుంటారు. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మనస్సులోని భావాలను పంచుకుంటారు. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. వ్యాపారులకు  లాభాలు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

మకరం

బంధువులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు. జీవితాశయం నెరవేరుతుంది. వాహనసౌఖ్యం. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు కలసివచ్చే సమయం. రాజకీయవేత్తలు, కళాకారులకు అంచనాలు నిజం కాగలవు. వారం మధ్యలో  ప్రయాణాలు. 

కుంభం

కుటుంబంలో శుభకార్యాల సందడి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ముఖ్య కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆస్తుల వ్యవహారాలలో సమస్యలు తీరతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారులు పెట్టుబడులు అందుకుంటారు. రాజకీయవేత్తలకు పదవులు దక్కుతాయి.

మీనం

వీరికి అనుకూల సమయం. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. శారీరక రుగ్మతలు. వ్యాపారులు అందివచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవేత్తలకు అరుదైన ఆహ్వానాలు.

వక్కంతం చంద్రమౌళి జ్యోతిష్య పండితులు
ఫోన్​: 98852 99400