వారఫలాలు : 2023 సెప్టెంబర్ 17 నుంచి 23 వరకు

వారఫలాలు : 2023  సెప్టెంబర్  17 నుంచి 23 వరకు

మేషం 

రుణబాధల నుంచి కొంత విముక్తి. వాహనాలు, భూముల కొనుగోలు యత్నాలు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. చేజారిన వస్తువులు, డాక్యుమెంట్లు లభ్యమవుతాయి. వ్యాపారాలు మెరుగ్గా ఉంటాయి. కొత్త భాగస్వాములు చేరతారు. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు జరిగే వీలుంది.

వృషభం

స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు. పలుకుబడి కలిగిన వ్యక్తులు చేదోడుగా నిలుస్తారు. నిరుద్యోగుల నిరీక్షణ ఫలించే సమయం. వ్యాపారాలు క్రమేపీ అనుకూలిస్తాయి. రావలసిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మీ సమర్థత, ప్రావీణ్యం పై స్థాయి వారు గుర్తిస్తారు. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, నూతన కంపెనీల  ఏర్పాటులో విజయం.

మిథునం

భూముల క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు. కోర్టు వ్యవహారాలలో అనుకూల వాతావరణం. వ్యాపారాల నిమిత్తం పర్యటనలు, కొత్త భాగస్వాములతో చర్చలు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం. ప్రభుత్వం, బ్యాంకుల నుంచి సాయం అందుతుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు విశేష ఆదరణ.

కర్కాటకం

ఆస్తుల వ్యవహారాలలో నెలకొన్న ఇబ్బందులు, సమస్యలు క్రమేపీ తొలగిపోతాయి. వాహనయోగం. జల, వాయు, రక్షణ ఉద్యోగయత్నాలలో నిరుద్యోగులకు విజయం. సమాజంలో విశేష గౌరవం. వ్యాపారులు భాగస్వాములను పెంచుకుంటారు. ఉద్యోగులకు విధి నిర్వహణ అనుకూలిస్తుంది. పైస్థాయి వారి ప్రశంసలు అందుకుంటారు. పారిశ్రామికవేత్తలు ఉత్పత్తుల పెంపుదలపై దృష్టి సారిస్తారు.

సింహం

ఉద్యోగాన్వేషణలో విజయం. రావలసిన బాకీలు వసూలవుతాయి. నూతన వ్యక్తుల పరిచయం. నిర్ణయాలలో మరింత చురుగ్గా వ్యవహరిస్తారు. స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు. వ్యాపారాల్లో తగాదాలు పరిష్కారం. ఉద్యోగాలలో ప్రతిభను చాటుకుంటారు. పై అధికారులు ప్రశంసిస్తారు. పారిశ్రామికవేత్తలకు ఊహించని విధంగా విదేశీయానం.

కన్య 

ఆశించిన ఆదాయం. నిరుద్యోగుల కృషి ఫలించే సమయం. కొత్త ఇంటి నిర్మాణయత్నాలు. ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. వ్యాపారాలు ఆశాజనకం. ఉద్యోగాలలో సహచరుల సహకారం. మీ స్థాయి పెరిగే అవకాశం. పారిశ్రామికవేత్తలకు బ్యాంకు, ప్రభుత్వ అనుమతులు. రాజకీయవేత్తలు, కళాకారులకు సన్మానాలు.

తుల

చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త భాగస్వాములు చేరతారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలు ప్రభుత్వంతో అగ్రిమెంట్లు చేసుకుంటారు.

వృశ్చికం

అనుకున్న రాబడి దక్కుతుంది. కొన్ని నిర్ణయాలు భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. ఆస్తుల వ్యవహారాలలో అనుకూలత. కోర్టు  వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. సాంకేతిక, వైద్యరంగాల్లో నిరుద్యోగులకు ఉపాధి లభించే ఛాన్స్‌. వ్యాపారాలు కొత్త భాగస్వాములు, పెట్టుబడులతో కళకళలాడతాయి. ఉద్యోగుల సేవలకు గుర్తింపు. పారిశ్రామికవేత్తలు ఉత్పత్తులపై దృష్టి సారిస్తారు.

ధనుస్సు

నిరుద్యోగులకు భవిష్యత్తుపై భరోసా. వాహనాలు, స్థలాలు కొంటారు. వ్యాపారాల్లో భాగస్వాములతో నెలకొన్న వివాదాలు కొంత సర్దుబాటు కాగలవు. ఉద్యోగాలలో సమర్థత నిరూపించుకునే సమయం. పారిశ్రామికవేత్తలు అనుకున్న పెట్టుబడులతో ఉత్సాహంగా సాగుతారు. రాజకీయవేత్తలు, కళాకారులు అనుకున్నది సాధిస్తారు.

మకరం

మీ అదృష్టం గొప్పదనే చెప్పాలి. త్రుటిలో కొన్ని సంఘటనల నుంచి బయటపడతారు. ప్రతి విషయంలోనూ దూరదృష్టి, ఓర్పు, నేర్పు అవసరం. వ్యాపారాలలో భాగస్వాములతో విభేదాలు. ఉద్యోగాలలో ఇష్టంలేని మార్పులు జరిగే వీలుంది. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ తాఖీదులు అందవచ్చు. వారారంభంలో వస్తులాభాలు. ఉద్యోగలాభం.

కుంభం

నిదానమే ప్రధానం అన్న సూక్తిని అనుసరించడమే మీ విజయరహస్యం. చరస్థిరాస్తుల విక్రయాలలో లాభాలు. వారసత్వంగా కొంత ఆస్తి, ధనలాభాలు. వ్యాపారాలు మరింతగా అనుకూలిస్తాయి. కొత్త భాగస్వాములు మీతో జతకడతారు. ఉద్యోగాలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కార్యోన్ముఖులై విధుల్లో ప్రశంసలు అందుకుంటారు.

మీనం

రావలసిన సొమ్ము అందుకుంటారు. కోర్టు వ్యవహారాలలో విజయం. నిరుద్యోగులకు అనుకోని ఉపాధి అవకాశాలు. స్థిరాస్తి విషయంలో అనుకూల పరిస్థితులు. శారీరక దారుఢ్యం. వాహనాలు, స్థలాలు కొంటారు. వ్యాపారాలలో కొత్త భాగస్వాములు  తోడవుతారు. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు. మంచి గుర్తింపు. పారిశ్రామికవేత్తలు నూతనోత్పత్తుల దిశగా వ్యూహాలు రూపొందిస్తారు.